Brahmamudi : కావ్యకి గుడ్ న్యూస్.. అప్పు పోలీస్ జాబ్ తెచ్చుకోగలదా!
on Sep 27, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -525 లో....సీతారామయ్య ఫ్రెండ్ తన ఇంటికి వస్తాడు. ఇన్ని రోజులాగా మీ కంపెనీతో నా మనవడు కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు. ఇక ఆ కాంట్రాక్టు కాన్సిల్ చేసుకున్నాడని అతను చెప్తాడు. ఎందుకు ఏమైంది అని సీతారామయ్య అంటాడు. మర్యాద తక్కువ అయింది.. నా మనవడిని రాహుల్ అవమానించాట అని అతను చెప్తాడు. ఇన్ని రోజుల నుండి మన మధ్య స్నేహం ఉంది కాబట్టి ఆ విషయం చెప్పాడనికి వచ్చానని అతను అనగానే చాలా థాంక్స్ రా ఇప్పటికైనా మా కంపెనీలో ఏం జరుగుతుందో తెలియజేశావని సీతారామయ్య అంటాడు.
ఆ తర్వాత అతను వెళ్లిపోయాక రాహుల్ ఎందుకు ఇలా చేసావ్ అంటూ తిడుతారని ముందుగానే రాహుల్ ని తిడుతుంది రుద్రాణి. నటించింది చాలు ఎక్కడ మేమ్ తిడుతామో అని తిట్టినట్లు నటిస్తున్నావ్ కదా అని ఇందిరాదేవి అంటుంది. ఆ రోజే కావ్య చెప్పింది.. రాహుల్ వద్దు ఇలాంటి సిచువేషన్ వస్తుందని కానీ పట్టించుకోలేదు. ఇక నుండి రాజ్ ఆఫీస్ కి వెళ్తాడని సీతారామయ్య చెప్తాడు. నేను వెళ్ళను.. పిన్నికి ఇష్టం అయితే వెళ్తా అని రాజ్ అంటాడు.... నా కొడుకు న్యాయం జరగాలి అన్నాను కానీ అది పక్కన పెట్టి ఈ విషయం ఆలోచిస్తున్నారు.. రాజ్ ఆఫీస్ వెళ్లడం నాకు ఇష్టమే కానీ కళ్యాణ్ ని ఇంటికి తీసుకొని వచ్చే బాధ్యత రాజ్ దే అని ధాన్యలక్ష్మి అంటుంది.
మరొకవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తాన్నాడు అని న్యూస్ తెలిసి కావ్యకి కనకం చెప్పాలని వస్తుంది. నాకేం చెప్పొద్దని కావ్య అనగానే సరే మీ ఆయన గురించి మా ఆయనకి చెప్తానని కనకం అంటుంది. రాజ్ ఆఫీస్ కి వెళ్తున్నాడంట రాహుల్ ఏదో తప్పు చేస్తే మళ్ళీ రాజ్ ని వెళ్ళమన్నారంట అని అనగానే కావ్య కూడా వింటుంది. ఆ తర్వాత అందరిలో తిట్టావంటూ రాహుల్ కోపంగా ఉంటాడు. అప్పుడే స్వప్న వచ్చి.. మీ ఇద్దరి యాక్టింగ్ సూపర్ సొంత కంపెనీలో ఇలా చేసేవాళ్ళని మిమ్మల్నే చూస్తున్నానని స్వప్న అంటుంది. మరొకవైపు అప్పు పోలీస్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంటే కళ్యాణ్ తనకి భోజనం తినిపిస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read