వీడియోతో అడ్డంగా దొరికిపోయిన కళ్యాణ్ భార్య!
on Jul 7, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -455 లో.... నా భర్త, అప్పులకి శిక్ష పడాలని అనామిక అంటుంది. నీ భర్తకి శిక్ష పడితే నీతో ఉండడు కదా అని జడ్జి అనగానే.. వచ్చాక తనలో మార్పు వస్తుందని అనామిక వాదిస్తుంది. అప్పుని అసలు వదలకూడదు.. ఆ ఇద్దరి గురించి ప్రపంచానికి తెలియాలని అనామిక అంటుంది. ఏ తీర్పు చెప్పాలో కూడా నువ్వే చెప్తావా అని అనామికతో జడ్జి అంటాడు. మీరేమంటారు కళ్యాణ్ అని జడ్జి అడుగగా.. నేను విడాకులు ఇస్తానని చెప్తాడు. ఈ శిక్ష నుండి తప్పించుకోవాలని లేదా అని జడ్జి అడుగుతాడు. నేను చేయని తప్పుకి శిక్ష పడితే ఆనందంగా భరిస్తాను. తనతో మళ్ళీ కాపురం చేసే కంటే జైల్లో ఉండడం బెటర్ అని కళ్యాణ్ అంటాడు. నాకు విడాకులిచ్చి అప్పుని పెళ్లి చేసుకోవడానికి లైన్ క్లియర్ చేసుకుంటున్నాడని అనామిక అంటుంది.
ఆ తర్వాత కళ్యాణ్ తరుపు లాయర్ అనామికతో మాట్లాడతాడు. ఊరికే ఎన్నిసార్లు అడుగుతారంటూ లాయర్ పై అనామిక చిరాకుపడుతంటే.. మరి మీరు కూడ పదే పదే అప్పు, కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడితే కళ్యాణ్ కి ఎలా అనిపిస్తుందంటూ లాయర్ లాజిక్ గా మాట్లాడతాడు. ఆ తర్వాత అనామిక తరుపున లాయర్... అప్పు, కళ్యాణ్ లు హోటల్ లో దొరికారు.. అందుకు సాక్ష్యమంటూ ఒక వీడియో చూపిస్తారు. ఆ వీడియో ఫేక్ అని కళ్యాణ్ లాయర్ నిరూపిస్తాడు. మీడియాని రప్పించి కావాలనే ఇదంతా అనామిక చేసిందని చెప్తాడు.
ఆ తర్వాత అనామిక లాయర్ అప్పుని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. మా మధ్య ఉంది కేవలం స్నేహమే అని అప్పు చెప్తుంది. మీ మధ్య ఏం సంబంధం లేదని నిరూపిస్తావా అని లాయర్ అప్పుతో అనగానే.. నిరుపిస్తానని చెప్తుంది. అప్పుడే కళ్యాణ్ లాయర్ వాళ్ళ మధ్య ఏం సంబంధం లేదు.. కావాలనే అనామిక చేస్తుంది.. ఇదంతా తన నోటితోనే చెప్పినట్టు వీడియో ఉందని లాయర్ జడ్జి కి ఇస్తాడు. గతంలో అనామిక, అప్పుకి ఎదరుపడి మాట్లాడిన వీడియో లాయర్ కి అప్పు ఇస్తుంది. అది అందరు చూస్తారు. అందులో అనామిక కావాలనే ఇదంతా చేస్తున్నా అని తన మాటల్లోనే చెప్తుంది. ఆ సాక్ష్యం కోర్టులో ఉన్నవాళ్ళు అంతా వింటారు. అనామికకి అప్పటికే బుక్కైపోయానన్నట్టు టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత లాయర్ అనామికదే తప్పు అనడనికి బలమైన సాక్ష్యం సేకరించారు.. అది ఎవరో కాదు కావ్య అని కావ్యని పిలుస్తాడు లాయర్. కావ్య రాత్రి అనామిక దగ్గరికి వెళ్ళినప్పుడు అనామిక మాట్లాడింది మొత్తం రికార్డు చేసి జడ్జికి ఇస్తుంది.
తరువాయి భాగం లో కావ్య దగ్గరికి రొమాంటిక్ గా రాజ్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.