Brahmamudi : కావ్య లాంటి ట్యాలెంటెడ్ డిజైనర్ లేరు.. కాబట్టి ఆమెని తీసుకురా!
on Oct 8, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -534 లో.. రాజ్ లోని అంతరాత్మ బయటకు వచ్చి.. వెళ్లి భార్యా బట్టలు బయటపడేసావు కదా వెళ్లి తీసుకొని రా అని అనగానే.. రాజ్ కోపంగా తీసుకొని రానని అంటాడు. ఎక్కడ వస్తువులు ఉంటే మనసు కరిగి వెళ్లి తీసుకొని వస్తావని భయపడి పడేసావు కదా అని రాజ్ తో తన అంతరాత్మ గొడవ పడుతుంది. మరొకవైపు కావ్య, అపర్ణ లు గుడిలో మాట్లాడుకుంటారు. అత్తయ్య అని కావ్య అనగానే.. ఎవరు నీకు అత్తయ్య నన్ను పట్టించుకోకుండా వెళ్లిపోయావ్ కనీసం ఎలా ఉన్నావని కూడా అడుగులేదని అపర్ణ అంటుంది.
నేనే దగ్గర ఉండి మిమ్మల్ని చూసుకోవాలనుకున్నాను కానీ ఇలా మీ అబ్బాయి నా మనసు ముక్కలు చేసి పంపిస్తాడనుకోలేదని కావ్య అనగానే.. నాకు అంత తెలుసు.. కనీసం నేను వచ్చేవరకు ఉండాలి కదా అని అపర్ణ అంటుంది. నన్ను భార్యగా ఒప్పుకోడట బలవంతంగా నాతో కాపురం చేసాడట అని అపర్ణపై కావ్య పడి ఎమోషనల్ అవుతుంది. నేను ఈ తప్పు చెయ్యలేదు.. నా కాళ్ళపై నేను నిలబడాలని అనుకున్నాను.. డిజైనర్ గా జాయిన్ అయ్యాను. కానీ ఆ అనామిక ఇలా చేస్తుందనుకులేదు.. నన్ను మోసం చేసి నా డిజైన్ అనామిక కొనుక్కొని ఇలా చేసింది. ఆ విషయం తనకి చెప్తే నమ్మడం లేదని కావ్య అంటుంది. అవన్నీ కాదు నాతో పాటు వచ్చి బుద్దిగా కాపురం చేసుకోమని అపర్ణ అనగానే.. నేను రానని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్యతో అపర్ణ మాట్లాడడం.. రాహుల్ చూసి రుద్రాణికి ఫోన్ చేసి చెప్తాడు.
మరోవైపు మమ్మీ ఎక్కడికి వెళ్ళిందంటూ రాజ్ అడుగుతాడు. అప్పుడే రుద్రాణి వచ్చి.. కావ్యని కలవడానికి వెళ్ళిందని చెప్తుంది. అప్పుడే అపర్ణ వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని రాజ్ అడుగుతాడు. రాజ్ కి తెలిసిందని సైగ చేస్తుంది ఇందిరాదేవి.. దాంతో కావ్యని కలవడానికి వెళ్ళానని అపర్ణ చెప్పగానే.. రాజ్ కోప్పడతాడు. రుద్రాణి ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడితే.. నాకు రాహుల్ ఫోన్ చేసి చెప్పాడని రుద్రాణి అంటుంది. అపర్ణ, ఇందిరదేవిలు కలిసి రుద్రాణిని తిడతారు. నా సంగతి సరే.. నీ కొడుకు ఏంటి ఇంట్లో అందమైన అమ్మాయిని వదిలి.. బయట వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని అపర్ణ చెప్తుంది.తరువాయి భాగంలో నా కంపెనీ లో వర్క్ చేస్తావని అగ్రిమెంట్ ఉందని కావ్యతో అనామిక అంటుంది. మరొక వైపు కావ్య లాంటి ట్యాలెంట్ అమ్మాయి మన కంపెనీలో లేకపోవడం వల్లే ఇలా జరిగింది.. వెంటనే కావ్యని మన కంపెనీలో డిజైనర్ గా అప్పాయింట్మెంట్ చెయ్ అని రాజ్ కి సీతారామయ్య చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read