వెళ్ళిపోతానని గేట్లు ఓపెన్ చెయ్యమన్న అవినాష్.. బిగ్ బాస్ ట్విస్ట్!
on Oct 23, 2024
బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ లోడింగ్ అవ్వబోతుంది. నిన్న మొన్నటి వరకు నామినేషన్స్ అంటూ హాట్ హాట్ గా సాగింది. ఇక తాజాగా వచ్చిన ప్రోమోలో పృథ్వీ మెడలో గోల్డ్ ఏసుకున్నావని తేజ అనగానే.. గోల్డ్ గోల్డ్ వేసుకొని తిరగడం ఫస్ట్ టైమ్ అని విష్ణు ప్రియ అంటుంది. ఇక అది విని అందరు రియాక్ట్ అయ్యారు. నేను వెళ్తా సర్ అని హరితేజ కమెడిగా అంటుంది. "నేను పోతా సర్ పోతా" అంటూ నయని అంటుంది.
ఒకే ప్యాకప్ అని అవినాష్ అంటాడు. ఇప్పుడు వాళ్ళు నిజం గా ఓపెన్ చెయ్యాలి.. ఇప్పుడు అని నిఖిల్ అనగానే.. బిగ్ బాస్ గేట్లు ఓపెన్ చేస్తాడు. ఒక్కసారిగా హౌస్ మేట్స్ అందరు గట్టిగా అరుస్తారు. ఇక అవినాష్ ని పట్టుకొని గేట్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఇంకొకసారి బయటకు వెళ్తానంటావా అని అవినాష్ తో తేజ అంటాడు. అందరు సరదాగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంటారు. తేజని బయటకు అందరు నెట్టేయ్యాబోతుంటే.. నన్ను అంటున్నారని తేజ అంటాడు. సర్ తప్పు అయింది సర్ ఇంకొకసారి అనను క్లోజ్ చెయ్యండి సర్ అని అవినాష్ వేడుకుంటాడు. దాంతో డోర్ క్లోజ్ చేస్తాడు. ఆ తర్వాత అవినాష్ జిమ్ ట్రైనర్ గా అందరికి ట్రైనింగ్ ఇవ్వాలని బిగ్ బాస్ చెప్తాడు.
ఇక అవినాష్ పొట్ట తగ్గాలంటూ తన పొట్ట చూపిస్తుంటే.. అందరు నవ్వేసుకుంటారు. ముందుగా నా ఫేవరెట్ స్టూడెంట్ తేజతో మొదలు పెడతానంటూ తనతో పుషప్స్ చేపిస్తాడు అవినాష్. ఇక తేజ పొట్ట కింద టచ్ కాకుండా.. అవినాష్ మధ్యలోకి దూరిపోతాడు. ఇక తేజ తిప్పలు మాములుగా ఉండవు.. ఇక ఇదంతా చూస్తూ హౌస్ మేట్స్ అంతా నవ్వేస్తుంటారు. ఈ లెక్కన నేడు టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. యూట్యూబ్ లో అత్యధిక వీక్షకాధరణ పొందుతున్న ఈ ప్రోమోని మీరు చూసేయ్యండి.