అవినాష్- రోహిణి స్కిట్ కి బిగ్ బాస్ ఫిధా.. సర్ ప్రైజ్ గిఫ్ట్ గా సాల్ట్ ప్యాకెట్!
on Oct 10, 2024
బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన టాస్క్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల పర్ఫామెన్స్ మాములుగా లేదు. వీరిలో స్వయంగా బిగ్ బాస్ నే ఆకట్టుకున్నారు అవినాష్- రోహిణి.
అసలేం జరిగిందంటే.. బిబి హోటల్ ముందు జబర్దస్త్ అవినాష్- రోహిణి కలిసి యాక్ట్ చేశారు. ఇది మోస్ట్ హిలేరియస్ గా మారింది. బిగ్‌బాస్ సొంత ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూపించేందుకు ఓ స్కిట్ చేశారు. బిగ్బాస్లా అవినాష్.. ఆయన భార్యలా రోహిణి కలిసి యాక్ట్ చేశారు. ఇక బిగ్‌బాస్ అనౌన్స్మెంట్ టైమ్‌లో ఎలా అయితే మాట్లాడతాడో అలానే ఇంట్లో కూడా ఉంటాడంటూ ఇద్దరు కామెడీ చేశారు. రోహిణి మీరు ఒకసారి యాక్షన్ రూమ్‌కి రండి.. అంటూ అవినాష్ అంటే.. ఇంట్లో చేసే యాక్షన్ ఏముండదు కానీ యాక్షన్ రూమ్‌కి వెళ్లి ఏం చేయాలి.. ఎన్నో రోజుల నుంచి వెయిటింగ్ రావయ్యా మగడా అని రోహిణి అంది. ఇక ఈ పంచులకి కంటెస్టెంట్లు తెగ నవ్వుకున్నారు.
ఇక ఈ స్కిట్ తర్వాత బిగ్ బాస్ వారిద్దరిని మెచ్చుకున్నాడు. టాస్కును వినోదాత్మకంగా చేసి మెప్పించినందుకు మీకు స్పెషల్ రివార్డ్ ఇస్తున్నానంటూ బిగ్ బాస్ ఓ సాల్ట్ ప్యాకెట్ పంపించాడు. ఇక ఆ తర్వాత హౌస్ లో బిబి హోటల్ టాస్క్ మొదలైంది. దీనిలో రోహిణి-అవినాష్ కలిసి యాక్ట్ చేశారు. అది సూపర్ ఫన్ ని జనరేట్ చేసింది. అందరు బాగానే పర్ఫామెన్స్ చేశారు వీరిలో ముఖ్యంగా రోహిణి-అవినాష్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అందించారు. ఇక నిన్నటి ఎపిసోడ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.