నాన్నకు స్ట్రోక్ వచ్చింది.. అనిల్ జీల ఎమోషనల్ పోస్ట్ !
on Jun 28, 2024
ప్రపంచంలో ప్రతీ మనిషికి నాన్నే సూపర్ హీరో.. అలాంటి నాన్నకి హార్ట్ స్ట్రోక్ అంటే వారు ఎంత టెన్షన్ పడతారో మాటల్లో చెప్పాలేం. అనిల్ జీలా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో వాళ్ళ నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, ట్రీట్ మెంట్ చేస్తున్నారని ఓ పోస్ట్ లో షేర్ చేశాడు.
అనిల్ జీల.. హలో వరల్డ్ తో చాలా మంది కి పరిచయం అయినా ఒక యూ ట్యూబేర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో మై విలేజ్ షో అనిల్ జీల అండ్ టీమ్ హవా నడుస్తుంది. యూట్యూబర్ గా అనిల్ జీల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న గంగవ్వని పాపులర్ చేసాడు అనిల్ జీల. మై విలేజ్ షో ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొంతమందితో కలిసి చిన్న చిన్న వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు. అనిల్ జీల క్రియేట్ చేసిన 'మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానెల్ ద్వారా గంగవ్వకి బిగ్ బాస్ షోలో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక నాగార్జున సైతం తనకి ప్రోత్సాహం అందించాడు.
యూట్యూబ్ వీడియోల నుండి అనిల్ కెరీర్ మొదలు పెట్టి.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నాడు. అనిల్ జీల ఎప్పటికప్పుడు విభిన్నంగా ఆలోచిస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఇక ఇప్పుడు వాళ్ళ నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు, తనకి స్ట్రెస్ లెవెల్ హై గా ఉందని పోస్ట్ చేశాడు. అనిల్ జీల ఇన్ స్టాగ్రామ్ లో 508K ఫాలోవర్స్ ఉన్నారు. ఇక మరో పోస్ట్ లో మెడ్ కవర్ హాస్పిటల్ లో వాళ్ళ నాన్న ఉన్నట్లు అనిల్ జీల చెప్పాడు. అలాగే హైదరాబాద్ నిమ్స్ లో ఎవరైన తెలిసిన వాళ్ళు ఉన్నారా? కొంచెం అర్జెంట్ అంటు మరో పోస్ట్ చేశాడు. అనిల్ జీల తెలిసిన వాళ్ళు రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాడు. మీలో ఎంతమందికి ఈ యూట్యూబర్ అనిల్ జీల తెలుసో కామెంట్ చేయండి.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)