ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ వారం ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో హరి ఎందుకు అలిగాడో కానీ శ్రీముఖికి రాజీనామా పత్రాన్ని ఇచ్చేసాడు. ఆ స్పెల్లింగ్ కూడా సరిగా రాయకపోయేసరికి శ్రీముఖి, అవినాష్ కలిసి బాగా ఆదుకున్నారు. "అసలు వెళ్ళిపోతున్నాను. ఎందుకు వెళ్ళిపోతున్నాను అనేది అడిగారా మీరు " అంటూ హరి బాధతో అనేసరికి "సరే ఎందుకు వెళ్తున్నావో చెప్పి సావు " అంటూ శ్రీముఖి.
"నాకు లైఫ్ లో గ్రోత్ కావాలి. " అన్నాడు. "హెయిర్ గ్రోత్ కావాలంటే మెడిసిన్ తీసుకో నీకు గ్రోత్ కావాలంటే కష్టం" అన్నాడు అవినాష్. "ఇంకెన్నాళ్లని 9 సంవత్సరాలు అయ్యింది నేను ఇంకా టీవిలో చేయాలా. అందుకే నేను టీవీని వదిలేసి ఓటిటికి వెళ్ళిపోతా. ఇంకో విషయం సొంతంగా ఓటిటి ఛానెల్ పెట్టేస్తా. ఎక్స్ప్రెస్ మొత్తం అన్ని షోస్ కి మనమే యాంకరింగ్ "అని హరి అనేసరికి "అప్పుడు మొత్తం అన్ని నువ్వు ఒక్కడివే చూసుకోవాలిగా " అన్నాడు అవినాష్. "ఓటిటి గురించి తెలుసా ప్రతీ నెలా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అదే టీవీ అనుకో కొన్నేళ్ల నుంచి మన ఫాన్స్ మన సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. మనల్ని సొంతం చేసుకున్నారు అన్నారు అవినాష్, శ్రీముఖి. "మీకు ఇంకా తెలీదేమో ఈరోజుల్లో ఎవరూ టీవీ చూడడం లేదు. హాట్ స్టార్ ఓటిటి ఓపెన్ చేస్తున్నారు. " అని చెప్పాడు హరి.
"ఎవరు చెప్పారు నీకు . టీవీ చూడడం మానేస్తే స్టార్ మా సీరియల్స్ ఈరోజున టాప్ రేటింగ్ లో ఎలా ఉన్నాయి. ఆదివారం పరివారం షో, బిగ్ బాస్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, కుకు విత్ జాతిరత్నాలు షోస్ అన్నీ ఎలా టాప్ లో ఉంటాయి " అని ఆవేశంతో అవినాష్ అనేసరికి "మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఓటిటిలో వచ్చిందే కదా అన్నాడు హరి. "నాకు అన్నం పెట్టిన టీవీని మర్చిపోలేను. ఈ టీవీ స్టార్స్ ఉండడం వల్లనే ఈరోజు నేను ఇక్కడ ఉన్నా. టీవీ నా ఓటిటినా మీరు చెప్పండి " అనేసరికి "ఒకటి నా కుడి కన్ను ఒకటి నా ఎడమ కన్ను" అని చెప్పేసరికి అవినాష్, హరి సైలెంట్ అయిపోయారు.
Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పరివారం షోకి ఎక్స్‌ప్రెస్ హరి రాజీనామా... గ్రోత్ కోసం ఓటిటికి
Aug 2, 2026 12:39PM
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com




