నా అకౌంట్ హ్యాక్ కాలేదు...డొనేషన్స్ అడిగింది నేనే
on May 16, 2024
రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే రీసెంట్ గా ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రూ. 3500 కావాలని కోరుతూ ఓ మెసేజ్ పోస్టు చేశారు దాంతో పాటు క్యూఆర్ కోడ్ కూడా షేర్ చేశారు. దీంతో కొంతమంది మనీ కూడా డొనేట్ చేశారు. ఐతే ఇంకొంత మంది అభిమానులు రేణు దేశాయ్ అకౌంట్ హ్యాక్ అయ్యుంటుంది..ఐనా ఇంత చిన్న అమౌంట్ కోసం ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ ఎందుకు పెడతారు అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మెసేజెస్ చూసిన రేణు దేశాయ్ తన సైడ్ నుంచి ఒక వీడియోని రిలీజ్ చేశారు.
తన అకౌంట్ హ్యాక్ కాలేదని, ఇన్ స్టాలో ఆ పోస్టు పెట్టింది తానేనని క్లారిటీ ఇచ్చారు. ఫుడ్ పాయిజన్ కావడంతో కొన్ని రోజులుగా తన హెల్త్ బాగోనే కారణంగా దీనికి సంబంధించిన వీడియో చేయలేకపోయానన్నారు. ‘నేను ప్రతీ నెల కొంత బడ్జెట్ పెట్టుకుని డబ్బు డొనేట్ చేస్తుంటాను. అప్పుడప్పుడూ కాస్త ఎక్కువగా అవసరం పడుతుంది. నాకూ కొన్ని లిమిట్స్ ఉంటాయి. నా డబ్బు మొత్తం డొనేషన్స్కు ఇచ్చేస్తే.. నా కోసం, పిల్లల కోసం కావాలి కదా..! చిన్న పిల్లల కోసం, కుక్కలు, పిల్లులు, ఆవుల సంరక్షణ కోసం నేను హెల్ప్ చేస్తున్నాను. ఆవుల కోసం ఓ షెడ్డును నిర్మిస్తున్నాను. ఏడాదిన్నరలోగా ఆ షెడ్డు నిర్మాణం పూర్తవుతుంది. అప్పుడు నేనే అఫీషియల్ గా డొనేషన్స్ అడుగుతాను. రిక్వెస్ట్ పెట్టిన వెంటనే స్పందించి మనీ డొనేట్ చేసినందుకు ధన్యవాదాలు. నా అకౌంట్ హ్యాక్ కాలేదు" అని ఆ వీడియో ద్వారా ఒక మెసేజ్ ని అందించారు.
Also Read