Home

»

Tv News

సుధీర్ అన్న రాకపోయినా నేను హోస్ట్ చేస్తా...ఆమెది జీరో ఆటిట్యూడ్

Apr 11, 2026


రీసెంట్ గా స్టార్ట్ ఐన  ఆట డాన్స్ షోలో ఎక్స్ప్రెషన్ క్వీన్ గా గ్రేస్ ఫుల్ డాన్సర్ గా పేరు తెచ్చుకుంది ప్రీతీ పట్నాయక్ . ఏ పెర్ఫార్మెన్స్  చేసిన జడ్జెస్ స్టాండింగ్ ఒవేషన్  ఇస్తారు .  అలాంటి ప్రీతి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తనకు  హిప్ హాప్ అంటే ఇష్టం. క్లాసికల్ కూడా చాలా ఇంటరెస్ట్ అని చెప్పింది. "ఆట షోకి వచ్చాక అందరూ గుర్తుపడుతున్నారు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగారు. మాది వైజాగ్.  9 వ తరగతి పరీక్షలు రాసాను ఇప్పుడు 10 కి వచ్చాను.

ఫ్రెండ్స్ బాగా ఏడిపిస్తారు. సెలబ్రిటీ ఇపోయావ్ అంటూ ఆటపట్టిస్తారు. టీచర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. పర్మిషన్ తీసుకునే నేను ఆట షోకి వచ్చాను. ఆట షోకి ఫస్ట్ డే వచ్చినప్పుడు కొత్తగా ఉంది. తర్వాత అందరూ కలిసిపోయారు. సుధీర్ అన్న ఒకవేళ హోస్టింగ్ కి రాకపోతే నన్ను చేయమని అడిగితే  కచ్చితంగా హోస్టింగ్ చేస్తాను. సుధీర్ అన్న సీట్ కి ఎసరు పెట్టాలని లేదు నాకు డాన్స్ అంటేనే ఇష్టం. ఇన్ ఫ్యూచర్ లో నేను ఒక నటిగా ఉండాలనుకుంటున్నాను.

నేను ఒక మోడల్ ని కూడా. మోడలింగ్ స్టార్ట్ చేసి రెండేళ్లు, డాన్స్ స్టార్ట్ చేసి ఆరేళ్ళు అవుతోంది. 2023 లో మిస్ ప్రీ - టీన్ ఆంధ్రప్రదేశ్, 2024 లో మిస్ ప్రీ - టీన్ ఇంటర్నేషనల్ ఇండియా టైటిల్స్ విన్ అయ్యాను. ఆట టైటిల్ కొడతాను అనే కాన్ఫిడెన్స్ ఐతే ఉంది. ఎప్పుడైనా నా ఓన్ స్టెప్స్ చెప్పినా కూడా కొరియోగ్రాఫర్ చేంజెస్ చేస్తారు. అంత పెద్ద స్టేజిలో  ఉన్నా జీరో ఆటిట్యూడ్ తో ఎలా ఉండాలో జడ్జ్ నిహారిక దగ్గర నుంచి నేర్చుకున్నా " అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com