
అమూల్య - నిరంజన్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్న పెయిర్. త్వరలో వీళ్ళు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. రీసెంట్ గా వీళ్ళు అమూల్యనిరంజన్ అనే యూట్యూబ్ ఛానల్ ని కూడా స్టార్ట్ చేశారు. అప్పుడే ఈ ఛానెల్ కి 50 k సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. దాంతో వీళ్ళు థాంక్యూ అంటూ పోస్ట్ లు కూడా ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నారు. ఇక వీళ్ళు ఇంకో వీడియోని కూడా పోస్ట్ చేశారు.
అదే కంపాటబిలిటీ టెస్ట్ వీడియో . బ్యాక్ గ్రౌండ్ లో అడిగే ప్రశ్నలకు వీళ్ళు ఆన్సర్స్ చేశారు. దిండ్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఇంతకు ఆ ప్రశ్నలు ఏంటి వాళ్ళ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. "ఐ లవ్ యు అని ఎవరు ముందు చెప్పారు ". "తప్పు చేసినప్పుడు ఎవరు సారీ చెప్తారు" " ఎవరు ఎక్కువ డ్రమాటిక్" " ఎవరు ఎక్కువ తింటారు " "ఎవరు ఎక్కువ నిద్రపోతారు " " ఎవరు ఎక్కువ అబద్దాలు చెప్తారు " "ఎవరు ఎక్కువ రొమాంటిక్" "ఇన్స్టాగ్రామ్ లో ఎవరు స్టాక్ చేస్తారు " అన్న ప్రశ్నలకు నిరంజన్ అని అమూల్య ఆన్సర్ ఇచ్చింది.
" రెడీ అవడానికి ఎక్కువ టైం ఎవరు తీసుకుంటారు " "ఎక్కువ ఓవర్ థింక్ చేస్తారు." "ఎవరు ఎక్కువ ఫైట్ చేస్తారు " "ట్రిప్స్ కి ఎవరు ఎక్కువ ప్లాన్ చేస్తారు " ఎవరికీ వంట రాదు " అన్న ప్రశ్నలకు అమూల్య అని ఆన్సర్ ఇచ్చాడు నిరంజన్. " ఎక్కువ డబ్బులు ఎవరు ఖర్చు చేస్తారు" "ఎవరు ఎక్కువ ఏడుస్తారు " "సర్ప్రైజెస్ ఎక్కువ ఎవరు ప్లాన్ చేస్తారు " అన్న ప్రశ్నలకు ఇద్దరం అని చెప్పారు. ఇక నెటిజన్స్ ఐతే "క్యూట్ గా ఉన్నారు, టామ్ అండ్ జేరిలా ఉన్నారు... స్వీట్ ఫైటింగ్ బాగుంది " అంటూ రిప్లైస్ ఇస్తున్నారు.






