Home

»

Exclusive Movie News

రాజమౌళి మాస్టర్ ప్లాన్.. 'వారణాసి'తో గ్లోబల్ మార్కెట్‌పై దండయాత్ర.!

Jul 15, 2026 2:30PM

ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రాజమౌళి అడుగులు ప్రపంచ వేదిక వైపు వేగంగా పడుతున్నాయి. 'బాహుబలి', 'RRR' సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్‌ను శాసించిన జక్కన్న, ఇప్పుడు 'వారణాసి' చిత్రంతో తన దృష్టిని గ్లోబల్ మార్కెట్‌పైకి మళ్లించారు. కేవలం ఒక సినిమా చేయడం మాత్రమే కాకుండా, తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు రాజమౌళి ఒక భారీ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏమిటి అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

గతంలో ఆస్కార్ నామినేషన్ అంటే ఏదో ఒక సినిమాను పంపడం మాత్రమే ఉండేది. కానీ, 'RRR' సమయంలో రాజమౌళి టీమ్ అమెరికాలో స్థానిక మూవీ క్లబ్స్‌తో అసోసియేట్ అయ్యి, ఆస్కార్ నామినేషన్ కోసం చాలా కసరత్తు చేశారు. సినిమా ప్రదర్శనలు నిర్వహించడం, స్థానిక ఓటర్లను ప్రభావితం చేయడం, డాక్యుమెంటేషన్ అందించడం వంటి పద్ధతుల ద్వారా గ్లోబల్ మార్కెట్‌లో తెలుగు సినిమా ముద్రను బలంగా వేయగలిగారు. ఈ గ్లోబల్ కనెక్టివిటీ కోసం పెట్టిన ఖర్చును చూసి కొందరు విమర్శించినా, అది భవిష్యత్తులో మన సినిమాకు దక్కబోయే గుర్తింపు ముందు చిన్న విషయమే అని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు.

ఇప్పుడు రాజమౌళి 'వారణాసి' సినిమాను అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా, స్పెయిన్ వంటి దేశాల్లో అక్కడి భాషల్లో కూడా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నారు. దీని కోసం ఒక గ్లోబల్ మార్కెటింగ్ హబ్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. భవిష్యత్తులో ఏ దర్శకుడు సినిమా తీయాలన్నా, ఈ హబ్‌లో స్క్రిప్ట్ పరిశీలన జరిపి, గ్లోబల్ కనెక్టివిటీకి తగినట్లుగా కరెక్షన్స్ తీసుకుని ముందుకు వెళ్లే వ్యవస్థను రాజమౌళి తీసుకురాబోతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మన దగ్గర పాన్ ఇండియా మార్కెట్‌లో 1800 కోట్ల రూపాయల బెంచ్‌మార్క్ ఉంది. కానీ, రాజమౌళి గ్లోబల్ మార్కెట్‌ను క్లిక్ చేస్తే, ఈ నెంబర్ అనేది ఏమాత్రం సరిపోని చిన్న నంబర్‌గా మారే అవకాశం ఉంది. తెలుగు హీరోలను గ్లోబల్ స్టార్స్‌గా మార్చడమే కాదు, మన కంటెంట్ క్వాలిటీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దిశగా ఆయన అడుగులు పడుతున్నాయి. ఈ 'వారణాసి' సినిమా కేవలం ఒక కథ మాత్రమే కాదు, తెలుగు సినిమా గ్లోబల్ ప్రయాణానికి ఒక 'కేస్ స్టడీ' కాబోతోంది. రాజమౌళి ఈ ప్రయోగం సక్సెస్ అయితే, హాలీవుడ్ స్థాయికి మన సినిమాలు చేరడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

 

SS Rajamouli, Varanasi Movie, Mahesh Babu, Oscar

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com