(సెప్టెంబర్ 2 పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా..)
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, స్మైల్, యాక్టింగ్, అన్నింటికి మించి సింప్లిసిటీ.. పవన్‌ని అప్పట్లో యూత్ ఐకాన్‌గా నిలిపాయి. మూడు దశాబ్దాల కెరీర్‌లో ఇప్పటివరకు దాదాపు 30 సినిమాలతో సందడి చేశారు పవన్. వీటిలో ఎన్నో హిట్స్ ఉన్నాయి. పవన్ కెరీర్‌లో టాప్ 10 హిట్ మూవీస్ విషయానికి వస్తే..
గోకులంలో సీత: పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఫస్ట్ హిట్ మూవీ గోకులంలో సీత. టైటిల్ రోల్‌లో రాశి నటించిన ఈ సినిమాని ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేశారు. 1997లో ఈ మూవీ రిలీజైంది.
సుస్వాగతం: కెరీర్ ఆరంభంలో పవన్‌ని యువతకు చేరువ చేసిన సినిమా సుస్వాగతం. ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో గణేశ్ అనే ప్రేమికుడు పాత్రలో జీవించేశారు పవన్. ముఖ్యంగా క్లైమాక్స్‌లో పవన్ నటన చూసి ఫిదా కానివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 1998లో వచ్చిన ఈ సినిమాని భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కించారు.
తొలిప్రేమ: పవన్ కళ్యాణ్‌ని ప్రతి ఒక్కరూ ఇష్టపడేలా చేసిన సినిమా తొలిప్రేమ. స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ.. ఇటు యువతరాన్ని, అటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో బాలు పాత్రలో ఎంతో సహజంగా నటించారు పవన్. 1998లో వచ్చిన ఈ ఎవర్‌గ్రీన్ లవ్ స్టోరీని కరుణాకరన్ రూపొందించారు.
తమ్ముడు: నటుడిగా పవన్ కళ్యాణ్ స్థాయిని పెంచిన సినిమాల్లో తమ్ముడు ఒకటి. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సుభాష్ గా తన అద్భుత నటనతో ఆకట్టుకున్నారు పవన్. 1999లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ రిలీజైంది. అరుణ్ ప్రసాద్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు.
బద్రి: నువ్వు నంద అయితే.. నేను బద్రి బద్రినాథ్.. అంటూ సరికొత్త హీరోయిజాన్ని ఆవిష్కరించిన సినిమా బద్రి. పవన్ కెరీర్‌లో వెరీ స్పెషల్ మూవీగా నిలిచిన ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ తెరకెక్కించారు. 2000లో ఈ సినిమా రిలీజైంది.
ఖుషి: ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమాల్లో ఖుషిది ప్రత్యేక స్థానం. సరదా ప్రేమకథగా తెరకెక్కిన ఈ మ్యూజికల్ సెన్సేషన్ లో సిద్ధార్థ్ రాయ్‌గా పవన్ విజృంభించారు. ఎస్.జె.సూర్య రూపొందించిన ఖుషి.. 2001లో థియేటర్స్‌లోకి వచ్చింది.
జల్సా: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన మొదటి సినిమా ఇది. మ్యూజికల్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీలో సంజయ్ సాహుగా విభిన్న కోణాలున్న పాత్రలో మెప్పించారు పవర్‌స్టార్. 2008లో ఈ సినిమా విడుదలైంది.
గబ్బర్ సింగ్: 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ.. పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇందులో టైటిల్ రోల్‌లో చెలరేగిపోయారు పవన్. ఈ కాప్ డ్రామాని హరీశ్ శంకర్ తెరకెక్కించారు.
అత్తారింటికి దారేది: పవన్ ని కుటుంబ ప్రేక్షకులకు ఎంతో దగ్గర చేసిన సినిమా ఇది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ.. రిలీజ్‌కి ముందే ఆన్ లైన్‌లో లీకైనా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి సంచలనం సృష్టించింది. 2013లో ఈ ఫ్యామిలీ డ్రామా విడుదలైంది.
OG: పవన్ కళ్యాణ్‌ని పవర్ ఫుల్‌గా ప్రెజెంట్ చేసిన సినిమాల్లో 'ఓజీ'ది ప్రత్యేక స్థానం. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్‌లో.. పవన్ స్క్రీన్ ప్రజెన్స్‌కి, పవర్ ఫుల్ యాక్షన్‌కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. 2025లో వచ్చిన ఈ మూవీ దాదాపు 300 కోట్లు కలెక్ట్ చేసి, పవర్ స్టార్ కెరీర్‌లోనే టాప్ గ్రాసర్‌గా నిలిచింది.
[power star pawan kalyan top ten movies, pawan kalyan birthday on september 2nd, pawan kalyan top ten hit movies, telugu movies, telugu top hit movies]




