
టాలీవుడ్ లో ఇప్పుడు ఓ సరికొత్త కలకలం రేగుతోంది. భారీ బడ్జెట్ సినిమాలకు ఓటీటీ సంస్థలు గట్టి షాక్ ఇవ్వబోతున్నాయి. ఇటీవల దుబాయ్‌లో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ అన్నీ కలిసి ఒక రహస్య సమావేశాన్ని నిర్వహించాయనే వార్త ఫిలింనగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మీటింగ్‌లో ఓటీటీ సంస్థలు ఒక సిండికేట్‌గా ఏర్పడి, తెలుగు ఇండస్ట్రీని, ముఖ్యంగా ఇక్కడి భారీ బడ్జెట్ సినిమాల మార్కెట్‌ను కట్టడి చేయడానికి ఒక పక్కా బ్లూప్రింట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏ స్టార్ హీరో సినిమా తీసుకున్నా బడ్జెట్ రూ. 200 కోట్లకు పైనే ఉంటోంది. నిర్మాతలు కూడా థియేట్రికల్ రెవెన్యూ కంటే ఎక్కువగా ఓటీటీ రైట్స్ మీదే ఆశలు పెట్టుకుంటున్నారు. అయితే, ఈ భారీ అంచనాలతో కొనుగోలు చేసిన సినిమాలు ప్లాట్‌ఫారమ్‌లపై సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోవడం వల్ల ఓటీటీ సంస్థలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ఈ కరెక్షన్ మెకానిజంను తెరపైకి తెచ్చారు.
దుబాయ్ రహస్య మంతనాల ముఖ్య సారాంశం ఏమిటంటే, ఇకపై పెద్ద సినిమాల రేట్ల విషయంలో ఓటీటీలు వేలంపాటకు వెళ్లకుండా ఒకే మాటపై నిలబడాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం హీరోల మార్కెట్ వాల్యూ, వారి గత చిత్రాల థియేట్రికల్ పెర్ఫార్మెన్స్‌ను బేస్ చేసుకుని స్పష్టమైన 'స్లాబ్ సిస్టమ్'ను రూపొందించారు. ఒక సినిమా సింగిల్ లాంగ్వేజ్ లో వస్తే ఒక రేటు, మల్టీ-లాంగ్వేజ్ (పాన్-ఇండియా) లో వస్తే మరో రేటు అని కచ్చితమైన గైడ్‌లైన్స్ పెట్టుకున్నారు. ఈ కొత్త రూల్స్ వల్ల మొదటగా ఎఫెక్ట్ అయ్యేది మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న 'వారణాసి' చిత్రమేనని ఇండస్ట్రీ టాక్. నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌కు రూ. 600 కోట్ల బిజినెస్ రేంజ్ ఆశిస్తుంటే, ఓటీటీ సంస్థలు మాత్రం హీరో గత సినిమా ఫలితాలను, మార్కెట్ క్యాపబిలిటీని లెక్కగట్టి ఒక రేట్ ఫిక్స్ చేయాలని చూస్తున్నాయి.
ఇలాంటి సిండికేటిజం వల్ల రాబోయే రోజుల్లో 'వారణాసి', 'డ్రాగన్', 'ఫౌజీ', 'రాక' వంటి ఎన్నో భారీ పాన్-ఇండియా చిత్రాల ఓటీటీ బిజినెస్‌కు గండి పడే ప్రమాదం ఉంది. ఓటీటీలు అన్ని కుమ్మక్కై సినిమాలు పంచుకోవడం ప్రారంభిస్తే, నిర్మాతలు వారు అడిగిన రేటుకే డిజిటల్ హక్కులను అమ్ముకోవాల్సి వస్తుంది.
ప్రస్తుతం శాటిలైట్ రైట్స్ మార్కెట్ కూడా అంత బ్రైట్‌గా లేదు. ఈ గందరగోళ పరిస్థితి నుండి టాలీవుడ్ బయటపడాలంటే వెంటనే ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫారమ్స్ వైపు దృష్టి పెట్టాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఓటీటీలపై డిపెండెన్సీని తగ్గించుకోవడానికి థియేట్రికల్ బిజినెస్‌ను మళ్లీ స్ట్రెంతన్ చేసుకోవడం ఒక్కటే ఏకైక మార్గం. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ చైన్స్‌తో ఉన్న అంతర్గత సమస్యలను పరిష్కరించుకుని, థియేటర్లను ఆడియన్ ఫ్రెండ్లీగా మార్చగలిగితేనే టాలీవుడ్ మళ్లీ కంట్రోల్‌లోకి వస్తుంది. లేకపోతే భారీ బడ్జెట్లతో పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న టాలీవుడ్‌ను ఓటీటీ సంస్థలు శాసించే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.
Tollywood, OTT Platforms, Dubai Meeting, Varanasi, TeluguOne




