Home

»

tmdbexclusive

ekalavya: అర్జునుడికి ఎదురైన ఘోర అవమానం.. ఇలాంటి సన్నివేశం మీరెప్పుడు చూసి ఉండరు 

May 11, 2026

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పౌరాణిక చిత్రాలకి ఉన్న ప్రత్యేకత, ప్రాధాన్యత వేరు. దేవతలు, రాక్షసులు పాలకడలిని చిలికినప్పుడు పౌరాణిక చిత్రం కూడా పురుడు పోసుకుందనే అభిప్రాయం పౌరాణిక చిత్రాల ప్రేమికుల్లో చాలా బలంగా ఉంది. గ్రాంధిక, దైవ  భాషని అలవోకగా పలికిస్తూ, క్యారక్టర్ లోని గాంభీర్యాన్ని కళ్ళకి  కట్టినట్లు చూపించే కట్టినట్లు చూపించే నటులే అందుకు ఉదాహరణ. అలాంటి అద్భుతమైన నటుల్లో లెజండ్రీ నటుడు నట విరాట్' గుమ్మడి వెంకటేశ్వరరావు, శరత్ బాబు అగ్రగణ్యులు. వీరిద్దరి కలయికలో వచ్చిన ఒక పౌరాణిక సన్నివేశం సోషల్ మీడియాలో నెటిజన్లని  విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోలో అర్జునుడిగా  శరత్ బాబు తనదైన హుందాతనంతో, రాజసంతో  నిండుతనాన్ని తీసుకువచ్చారు. సాధారణంగా సౌమ్యమైన క్యారెక్టర్స్ కి  కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే శరత్ బాబు,సదరు సన్నివేశంలో గంభీరమైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. ఆయన ఉచ్చారణలో ఉన్న స్పష్టత, భావయుక్తంగా డైలాగులు చెప్పే తీరు నేటి తరం నటులకి ఒక పాఠం లాంటిదని చెప్పవచ్చు.

మరోవైపు ద్రోణాచార్యుడుగా గుమ్మడి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన కంచు కంఠం నుండి వచ్చే ప్రతి మాట ఒక ఆభరణంలా ఉంటుంది. ఈ సన్నివేశంలో ఆయన పలికించిన హావభావాలు, పెద్దరికం ఉట్టిపడేలా ఆయన చేసిన నటన వెండితెరపై ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాయి. అర్జునుడు, ద్రోణాచార్యుడు  మధ్య సాగే ఈ సంభాషణలు కేవలం మాటలు మాత్రమే కావు,  క్యారెక్టర్స్ మధ్య   ఉన్న సంఘర్షణ, ధర్మాన్ని ప్రతిబింబిస్తాయి. పౌరాణిక చిత్రాల్లో చేయడం  అంటే కేవలం మేకప్ వేసుకోవడం కాదు, ఆ కాలం నాటి ఉదాత్తతని  చూపించాలి. సదరు వీడియోలో ఉన్న  అల్టిమేట్ సీన్ చూస్తుంటే, ఆనాటి నటులు ఎంతటి క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేసేవారో అర్థమవుతుంది. దర్శకులు కూడా ఎంతటి జాగ్రత్తలు తీసుకునేవారో ఈ దృశ్యం నిరూపిస్తోంది.

ప్రస్తుత కాలంలో భారీ గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ, ఆనాటి నటుల ముఖాల్లో కనిపించే తేజస్సు, వారు పలికే స్వచ్ఛమైన తెలుగు మాటలు ఇచ్చే అనుభూతి అద్వితీయం. అందుకే యూట్యూబ్‌లో ఈ వీడియో కింద నెటిజన్లు "ఇలాంటి నటులని  మళ్ళీ చూడలేం" అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన ఇటువంటి క్లాసిక్ చిత్రాలు మరియు సన్నివేశాలు మన సంస్కృతికి వారధులు. శరత్ బాబు, గుమ్మడి వంటి మహానటుల నటనను చూసి ఆస్వాదించడం ప్రతి తెలుగు సినిమా అభిమాని అదృష్టం. మీరు కూడా ఈ అద్భుతమైన పౌరాణిక దృశ్యాన్ని చూసి ఆ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోండి.

సదరు  వీడియోలో పాండవులు, కౌరవుల మధ్య విలు విద్యలో పోటీలు. చిత్త శుద్ధి లేని విద్యార్థి లక్ష్య సిద్దిని పొందలేడని అర్జునుడిని భీష్ముడు తిట్టడం. ఆ తర్వాత అర్జునుడితో   నిన్ను విలు విద్యలో విశ్వంలోనే తిరుగు లేని వాడిగా చేస్తాను. దీంతో నా పగకి అర్ధం తెలుస్తుందని ద్రోణాచారుడు అనడం. అందుకు కారణమైన ద్రుపదుడు గురించి అర్జునుడికి చెప్పడం. సూపర్ స్టార్ కృష్ణ ఏకలవ్యుడిగా పరిచయం అవ్వడం కూడా ఉంటుంది. మరి ఈ పాటికే మీకు అర్ధమయ్యి ఉంటుంది. ఏకలవ్య చిత్రలోనిది ఈ సన్నివేశం అని. లేటు చెయ్యకుండా ఈ అద్భుతమైన సీన్ మా తెలుగు వన్ ఛానల్ లో ఉంది. చూసి తరించండి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com