Home

»

Exclusive Movie News

రెచ్చిపోయిన జయసూర్య: మేం ఎక్కడికో తీసుకెళ్ళాలి అనుకుంటాం.. మీరు అక్కడికి రారు.!

Aug 13, 2026 12:24PM

టాలీవుడ్ లో కామెడీ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే క్రేజీ కాంబినేషన్లలో డైరెక్టర్ శ్రీను వైట్ల, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం జోడీ ఒకటి. వీరి కాంబోలో వచ్చిన ప్రతీ సినిమా కూడా ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించింది. అందులోనూ నాగార్జున హీరోగా నటించిన 'కింగ్' సినిమా కామెడీ లవర్స్‌కు ఒక స్పెషల్ ట్రీట్ అని చెప్పవచ్చు.

ఈ సినిమాలో బ్రహ్మానందం పోషించిన 'జయసూర్య' పాత్ర టాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ ఐకానిక్ కామెడీ క్యారెక్టర్లలో ఒకటిగా నిలిచింది. సంగీత దర్శకుడిగా బిల్డప్ ఇచ్చే జయసూర్య పడే తిప్పలు, ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ థియేటర్లలో నవ్వులు పూయించాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ సీన్లకు సంబంధించిన మీమ్స్ విపరీతంగా వైరల్ అవుతుంటాయి.

ఇందులో శ్రావణి అనే పాత్రలో త్రిష నటించింది. జయసూర్య జడ్జిగా వ్యవహరించే ఒక మ్యూజిక్ షోలో శ్రావణి పాడటానికి వస్తుంది. 'శంకరాభరణం'లోని "సామజవరగమన" పాట పాడుతుండగా.. జయసూర్య కావాలని ఫైర్ అవుతాడు. "నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి? తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నది ఏ నెంబర్? నువ్వు పాడుతున్న టెంపో ఏ నెంబర్?" అంటూ విరుచుకుపడతాడు. 

"ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేస్తుంది" అంటూ బిల్డప్ ఇస్తాడు. ఇదే ఫ్లోలో తన మనసులో ఉన్న అసలు ఉద్దేశాన్ని బయటపెడతాడు. "మేం ఎక్కడికో తీసుకెళ్లాలి అనుకుంటాం. మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి రారు" అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి "గెస్ట్ హౌస్ కా?" అనగానే.. బ్రహ్మానందం అవును అన్నట్టుగా ఇచ్చే రియాక్షన్ ఈ సీన్ కే హైలైట్ అని చెప్పొచ్చు.

బ్రహ్మానందం డైలాగ్స్, రియాక్షన్స్ కలిసి ఈ సీన్‌ను టాలీవుడ్ కామెడీ హిస్టరీలోనే ఒక క్లాసిక్‌గా నిలబెట్టాయి. 

 

 

King Movie, Comedy Scenes, Brahmanandam, Trisha, Nagarjuna

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com