Home

»

Exclusive Movie News

లంచం అడిగిన పోలీస్‌ను నడిరోడ్డు మీదే కొట్టిన పెద్దాయన!

Jun 30, 2026 1:15PM

విలక్షణ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan), సంచలన దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్‌లో వచ్చిన 'భారతీయుడు' (Indian) ఒక అద్భుత దృశ్యకావ్యం. అవినీతిపై పోరాడే ఒక వృద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు సేనానిగా కమల్ హాసన్ చూపించిన నటన, రౌద్రం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలోని అత్యంత ప్రసిద్ధమైన యాక్షన్ సీన్ ఒకటి సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది. (Bharateeyudu Movie)

ట్రాఫిక్ సిగ్నల్స్ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ, గ్రీన్ సిగ్నల్ పడగానే రోడ్డుపై ముందుకు సాగుతున్న ఒక సామాన్య వాహనదారుడిని అకారణంగా కానిస్టేబుల్ ఆపుతాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, నిబంధనల ప్రకారమే వస్తున్నానని ఆ వ్యక్తి ఎంత మొత్తుకున్నా అవతలి వైపు ఉన్న ట్రాఫిక్ పోలీస్ వినిపించుకోదు. పైగా కేసు నమోదు చేయకుండా ఉండాలంటే 150 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. 

తప్పు చేయని ఒక సామాన్యుడిని అలా నడిరోడ్డుపై వేధిస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోతాడు భారతీయుడు. ఆ పోలీస్ చేసిన అవమానకరమైన పనికి, సామాన్యుడి ఆవేదనకు ఆ పెద్దాయన రక్తం మరిగిపోయింది. రంగంలోకి దిగిన భారతీయుడు.. సామాన్యుడి కాలి బూటును విప్పించి, దానిని శుభ్రంగా తుడిచి, 150 రూపాయలు తీసుకోమని భారతీయుడు  చెబుతాడు. ఆ మాటలకు ట్రాఫీస్ పోలీస్ ఒక్కసారిగా షాక్‌ అవుతాడు. ఒక సామాన్య వృద్ధుడు వచ్చి తననే ఎదురిస్తాడా అనే అహంకారంతో, నువ్వు అసలు ఎవరివి అంటూ కోపంతో ఊగిపోయాడు. దాంతో 'మర్మకళ'తో అతనికి బుద్ధి చెప్పాలని మొదట భావించిన భారతీయుడు, ఆ తర్వాత మనసు మార్చుకొని చెంపదెబ్బ కొడతాడు. దాంతో ట్రాఫిక్ పోలీస్ కిందపడిపోతాడు. భారతీయుడు చేసిన పనికి అక్కడ ఉన్న వారంతా చప్పట్లు కొడతారు.

ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ మరియు లైక్స్‌తో దూసుకుపోతోంది. ఇండియన్ సినిమాలో 'భారతీయుడు' సృష్టించిన ఇంపాక్ట్ ఎలాంటిదో ఈ ఒక్క షార్ట్ వీడియో నిరూపిస్తోంది. నెటిజన్లు కూడా "ఎప్పటికీ నెంబర్ వన్ క్లాసిక్ సీన్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com