
సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు నటులకు మంచి గుర్తింపును తీసుకొస్తుంటాయి. ‘విశ్వనాథన్ సన్స్’ సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న నటుడు సునీల్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఈ సినిమాలో తన పాత్రకు వచ్చిన స్పందనతో సంతోషంగా ఉన్న ఆయన.. తన తదుపరి ప్రాజెక్టుల గురించి తాజాగా 'తెలుగువన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా బాలకృష్ణతో తనకున్న అనుబంధం, ‘దాదా’ సినిమాలో తన పాత్ర గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
‘విశ్వనాథన్ సన్స్’ సినిమాలో తనకు మంచి పాత్ర దక్కిందని సునీల్ రెడ్డి తెలిపారు. దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ ఇచ్చిన అవకాశాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. ఈ సినిమాలో హీరోతో కలిసి సాగే ప్రయాణం, కీలక సన్నివేశాలు తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘దాదా’ సినిమాలో సునీల్ రెడ్డి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మైసూర్లో జరిగిందని, ఇప్పటికే 15 రోజులకు పైగా చిత్రీకరణలో పాల్గొన్నానని తెలిపారు. గతంలో బాలకృష్ణతో తనకు పరిచయం ఉండటంతో.. సెట్స్‌లో కలిసినప్పుడు ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించారని చెప్పారు.
‘ఏయ్ పెద్దిరెడ్డి.. రారా’ అంటూ బాలకృష్ణ పిలుస్తారని సునీల్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. తన తండ్రి, ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డితో బాలకృష్ణకు ఉన్న అనుబంధం కూడా ఈ ఆప్యాయతకు ఒక కారణమని తెలిపారు. బాలయ్య తన కుటుంబంతో కూడా మంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: మాస్ ధమాకా.. బాలయ్య ‘దాదా’ నుంచి అదిరిపోయే అప్డేట్.!
‘దాదా’ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇందులో తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని సునీల్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఫ్యామిలీ డ్రామా, కీలక సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. బాలకృష్ణ గారు కూడా మైసూర్ షెడ్యూల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని, గాయం నుంచి దాదాపు 80 శాతం కోలుకున్నారని అన్నారు.
మొత్తానికి ‘విశ్వనాథన్ సన్స్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్ రెడ్డి.. ఇప్పుడు బాలయ్య ‘దాదా’లో ఎలాంటి పాత్రతో అలరిస్తారో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
బాలయ్యతో భీష్మ.. 17 ఏళ్ళ క్రితం ప్లాన్ చేసిన క్రేజీ మూవీ.. ఎందుకు ఆగిపోయింది.?
ఎన్టీఆర్‌కు అత్యంత ఆప్తుడు.. ‘కర్తవ్యం’లో విలన్‌గా మెప్పించిన ఈ నిర్మాత ఎవరో తెలుసా.?
[Actor Sunil Reddy Interview, Sunil Reddy About Balakrishna, Sunil Reddy About Dada, Balakrishna Dada Movie, Nandamuri Balakrishna, Gopichand Malineni, Sunil Reddy, Vishwanath & Sons, Telugu Film News]




