Home

»

Latest News

గ్రాండ్ ఎంట్రీ: యూట్యూబ్ సెన్సేషన్ 'ఏయ్ జూడ్' హీరోగా సినిమా ప్రారంభం.! 

Oct 17, 2026 6:07PM

యూట్యూబ్ సెన్సేషన్, ‘ఏయ్ జూడ్’గా పాపులర్ అయిన అజయ్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమా నేడు అధికారికంగా ప్రారంభమైంది. రాము కొప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నెక్సస్ సినిమాస్, స్కైబ్లేజ్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్లపై నెక్సస్ శ్రీధర్, దీపక్ ముస్త్యాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, ఫహాద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రాఫర్‌గా, క్రాంతి ప్రియమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు, ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. 

ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు హరీష్ శంకర్ తొలి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు బుచ్చిబాబు సానా తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు.

ఇది కూడా చదవండి: పాటకు ప్రాణం పల్లవి అయితే: వాసు పాటలోని అసలు భావం ఇదే.!

 

 

[YouTuber Aye Jude Movie Launch, YouTuber Aye Jude, YouTuber Ajay, Ajay Hanumanthu, Telugu Movies 2026, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com