
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం యూట్యూబ్ లో తన అప్ కమింగ్ మూవీ ది ప్యారడైజ్ నుంచి రిలీజ్ చేసిన తన సెకండ్ సింగిల్ 'యేష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల' సాంగ్ తో యూ ట్యూబ్ లో సరికొత్త సునామీ సృష్టిస్తున్నాడు.
మొన్న శనివారం విడుదలవ్వగా కేవలం 24 గంటల వ్యవధిలోనే యూట్యూబ్‌లో ఏకంగా 30 మిలియన్లకి (3 కోట్లు) పైగా డిజిటల్ వ్యూస్ కొల్లగొట్టి రికార్డులు తిరగరాసింది. దీంతో యూట్యూబ్ ఆల్ ఇండియా మ్యూజిక్ ట్రెండింగ్ కేటగిరీలో నెంబర్ 1 స్థానంలో నిలిచిన ఈ సాంగ్ ప్రస్తుతం 36 మిలియన్ల వ్యూస్ తో 3 కోట్ల అరవై లక్షలు) రికార్డులే హద్దుగా దూసుకుకెళ్తుంది. పాటలో నాని వేసిన ఎనర్జిటిక్ మాస్ హుక్ స్టెప్పులు, మాస్ మూవ్‌మెంట్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో వైరల్ అవుతూ మిలియన్ల కొద్దీ వ్యూస్ రీ క్రియేషన్స్ రాబడుతున్నాయి.
Also Read: Toxic: టాక్సిక్ పుణ్యం: యష్ ఇమేజ్ దెబ్బతిందా!
తెలంగాణ నేటివిటీని, ఆటిట్యూడ్ ప్రతిబింబించే అత్యంత ప్రజాదరణ పొందిన 'యేష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల..' అనే జానపద బాణీ ఆధారంగా ఈ మాస్ ట్రాక్‌ను డిజైన్ చేశారు. ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ తనదైన శైలిలో కసి, పౌరుషం, గ్రామీణ మూలాలు ఉట్టిపడేలా అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ జానపద బాణీకి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ తన ఎలక్ట్రిఫైయింగ్ మోడ్రన్ డీజే ఎలక్ట్రానిక్ బీట్స్‌ను జత చేసి, శ్రోతలను ఊపేసేలా హై-వోల్టేజ్ డ్యాన్స్ నంబర్‌గా తీర్చిదిద్దారు. నానితో కీర్తి సురేష్ రేపు థియేటర్స్ లో రచ్చ చేయనుంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకుడు.
[ Yesha Nagula Katta, Telangana, Nani, Keerthi Suresh, The Pardise, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood ]






