
సినీ విశ్వంలో తెలుగు సినిమా ప్రకాశిస్తూ ఉన్నంతవరకు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు పేరు, పేరు తాలూకు వైబ్రేషన్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఆ మాట కొస్తే భారతీయ చిత్ర పరిశ్రమ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతీయ చలనచిత్ర చరిత్రలో విలన్, నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ కి నాయకుడితో సమానంగా, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ క్రేజ్ తెచ్చిపెట్టడం అనేది ఎన్టీఆర్ వల్లనే అయ్యింది.
ఈ పాటికే మీకు అర్ధమయ్యి ఉంటుంది. ఎన్టీఆర్ పోషించిన రావణ క్యారక్టర్ అని. నిజం చెప్పుకోవాలంటే రావణ క్యారక్టర్ ని ప్రేక్షకులు చీదరించుకొవాలి. తమ శక్తీ కొలది తిట్లు కూడా తిట్టాలి. కానీ రావణుడి పెర్ఫార్మ్ కి విజిల్స్ . పేపర్స్ చించి గాల్లోకి విసరడం. ఇదంతా అన్న గారు నుంచి వచ్చిన మెస్మరైజ్ పెర్ఫార్మెన్స్. ఇదంతా తెలిసిన విషయమైనా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే రాకింగ్ స్టార్' యష్ 'రామాయణ'తో రావణాసురుడిగా చేస్తున్నాడు.
ఇది కూడా చదవండి: గానకోకిల సుశీలమ్మ జీవితం వెండితెరపైకి.. టైటిల్ రోల్‌లో మీ అభిమాన హీరోయిన్!


మేకర్స్ రీసెంట్ గా రావణుడి 'రుద్ర తాండవం' వీడియో రిలీజ్ చేసారు. ఇక అంతే రికార్డు వ్యూస్ తో సోషల్ మీడియాని ఏలే పనిలో ఉన్నాడు. అభిమానులు, మూవీ లవర్స్ అయితే సూపర్ గా ఉంది పెర్ఫార్మెన్స్ , బెస్ట్ ఆఫ్ లక్ అనే కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఇక్కడ కూడా రావణుడిని తిట్టాలి. కానీ పోగొడుతున్నారంటే అన్న ఎన్టీఆర్ వల్లనే అనేది జగమెరిగిన సినీ సత్యం.
[Yash Ramayana Rudra Tandavam, NTR Ravana Craze, Yash Ramayana Movie, Yash As Ravana Rudra Tandavam, Ramayana Yash Entry Video, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






