
రాకింగ్ స్టార్ యష్ ఈ నెల 26 న టాక్సిక్ తో వరల్డ్ వైడ్ గా తన సత్తా చాటడానికి వస్తున్న విషయం తెలిసిందే. దీంతో థియేటర్స్ అన్ని ఆ దివ్యమైన రోజు కూడా ఎదురుచూస్తూ ఉన్నాయి. అభిమానుల్లో, సినీ సర్కిల్స్ లో అయితే ట్రైలర్ రిలీజ్ రోజు నుంచే సందడి వాతావరణం నెలకొంది. దీంతో టాక్సిక్ గురించి మాట్లాడుకోవడం తన రోజు వారి దిన చర్య గా మారింది.
యష్ పర్సనల్ విషయానికి వస్తే భార్య పేరు రాధికా పండిత్. ఒకప్పటి హీరోయిన్. ఆమె రీసెంట్ గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో '10 సంవత్సరాల నిశ్చితార్థం, జీవితాంతం నిలిచిపోయే ప్రేమ.. మాకు అత్యంత ఇష్టమైన ఈ అందమైన కథ ఇంకా రాయబడుతూనే ఉంది. ఆగస్టు 12, 2016 నాటి ఆ రోజున నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకు నేను చెప్పిన 'YES' వర్డ్ నా జీవితంలోనే అత్యుత్తమమైనది. నువ్వు ఎప్పటికీ నా ఫేవరెట్ 'YES'గానే ఉంటావు" అంటూ రాసుకొచ్చారు. ఎంగేజ్‌మెంట్ తాలూకు పిక్స్ కూడా షేర్ చెయ్యడంతో అభిమానులు, నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నాయి.
Also read: సంచలనం: మాజీ భర్త రెండో పెళ్లి రిసెప్షన్ ఫోటోలు..#ఊర్మిళ మటోండ్కర్ వైరల్ పోస్ట్
2007వ సంవత్సరంలో 'నంద గోకుల' అనే కన్నడ టెలివిజన్ సీరియల్ సెట్స్‌లో యష్, రాధికా పండిత్ పరిచయం జరిగింది. ప్రారంభంలో మంచి స్నేహితులుగా ఉన్న తర్వాత ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ప్రేమికులుగా మారారు. 2008లో వచ్చిన 'మొగ్గినా మనసు' సినిమాతో వెండితెర అరంగేట్రం చేసి 'డ్రామా', 'మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి', 'సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్' వంటి పలు విజయవంతమైన చిత్రాలలో కలిసి నటించి, తెరపై తమ అద్భుతమైన కెమిస్ట్రీతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు.
అయితే, తమ ప్రేమ వ్యవహారాన్ని చాలా ఏళ్ల పాటు బయటి ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచడం విశేషం. 2016 ఆగస్టు 12న గోవాలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, అదే ఏడాది డిసెంబర్ నెలలో వివాహ బంధంతో ఒకటయ్యారు. వివాహ అనంతరం బెంగళూరు ప్యాలెస్‌లో తమ ప్రియమైన అభిమానుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన రిసెప్షన్ వేడుక అప్పట్లో ఒక సంచలనంగా నిలిచింది. వీరికి ఒక కుమార్తె, ఒక కొడుకు. పేర్లు అయ్రా, యథార్వ్.
#Yash, Radhika Pandit, Sandil Wood, Toxic






