Home

»

Latest News

హర్రర్ సినిమాలంటే ఇప్పుడు భయం లేదా? కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

Oct 23, 2026 4:05PM

 

హర్రర్ మూవీ.. సినీప్రేమికులు తమ జన్మ ధన్యమయ్యిందని భావించే జోనర్.. ఇక ప్రేక్షకులైతే నా సామిరంగా కళ్ళని తమ గుప్పెట్లతో మూస్తూ, తెరుస్తూ, మూస్తూ, తెరుస్తూ చూసి మహదానందాన్ని పొందుతారు. కొంత ముందైతే  సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాలకి ఇదేదో తేడాగా ఉందే అని వెళ్తూ హర్రర్ జోనర్ కి ఉన్న గొప్పతనాన్ని తను స్టే చేసిన ప్రతి చోట చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కంప్లీట్ గా చూసిన ప్రేక్షకులకైతే  రెండు మూడు రోజులు వెంటాడే మూవీ కూడా. 

దీంతో  స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఆ హర్రర్ మూవీ విశేషాలని తానే దర్శకుడిగా తెరకెక్కించిన విధంగా చెప్పేవాడు.  కానీ, నేటి ఆధునిక కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎంతటి భారీ భయానక హర్రర్ సినిమా వచ్చినా, నేటి ప్రేక్షకులు అసలు   భయపడటం లేదు సరి  కదా, పైగా ఆ సినిమాలను ఒక రీసెర్చ్ అనలిస్ట్ లాగా, క్రిటిక్ లాగా విశ్లేషించడం మొదలుపెట్టారు. హర్రర్ సినిమా మేకర్స్ ఏమో సినిమా టైటిల్స్ కి   కి ముందు మా సినిమాలో భయపడే శబ్దాలు, సన్నివేశాలు ఉంటాయి. సౌండ్స్ కూడా భ యపుట్టిస్తాయి. కాబట్టి దయచేసి హార్ట్స్ పేషంట్స్, భయస్థులు మా సినిమా చూడకపోవడం మంచిది అని చెప్తున్నారు. కానీ ప్రేక్షకులు ఆ టైంలో కూడా తన బిజీలో తాను ఉంటూ వాళ్ళు చెప్పేది కళ్ళతో మాత్రమే చూస్తున్నాడు. అసలు ప్రేక్షకులలో ఈ విధమైన ఆశ్చర్యకరమైన మార్పు ఎందుకు వచ్చింది? హర్రర్ సినిమాల ప్రభావం తగ్గడానికి వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏమిటి అనే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దీనికి అత్యంత ముఖ్యమైన కారణం మన మైండ్ సెట్ మరియు టెక్నాలజీ అభివృద్ధి. ఒకప్పుడు రోజుకు కేవలం కొన్ని గంటల పాటు టీవీ ప్రసారాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. నేడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్, చేతివేళ్ల చివర 24 గంటల వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రతిరోజూ వేలాది గంటల క్రైమ్, థ్రిల్లర్, సైంటిఫిక్, మరియు హర్రర్ కంటెంట్‌ను మనం నిరంతరం చూస్తూనే ఉన్నాం. దీనివల్ల మన మెదడు ఈ తరహా భయానక దృశ్యాలకు పూర్తిగా అలవాటు పడిపోయింది. గతంలో ఒక చిన్న దెయ్యం నీడను చూసి భయపడిన ప్రేక్షకుడు, నేడు అంతకంటే భయంకరమైన విజువల్స్, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ , అడ్వాన్స్‌డ్ ఎఫెక్ట్స్‌ను నిత్యం చూస్తుండటంతో భయం అనే సహజ భావోద్వేగం చాలా వరకు తగ్గింది.


ఇది కూడా చదవండి: సూపర్ స్టార్ టూ మెగాస్టార్: వయా ఐకాన్ స్టార్ 

 

మరొక ముఖ్యమైన కారణం హర్రర్ సినిమాల మేకింగ్ విధానంలో వైవిధ్యం లేకపోవడం. ప్రస్తుతం వస్తున్న చాలా హర్రర్ సినిమాలు ఒకే రకమైన మూస ధోరణిలో సాగుతున్నాయి. పాతకాలపు బంగ్లాలు, అర్ధరాత్రి వేళల్లో వచ్చే వింత శబ్దాలు, ఒకే రకమైన జంప్ స్కేర్లు, దెయ్యం పట్టిన పాత్రల ముఖ కవళికలు మరియు ప్రతికూల వాతావరణం... ఇలా అన్నీ ముందుగానే ఊహించగలిగేలా తయారయ్యాయి. తెరపై తర్వాతి సన్నివేశంలో ఏం జరగబోతోందో ప్రేక్షకుడు చాలా సులభంగా అంచనా వేయగలుగుతున్నాడు. కథనంలో ఎలాంటి కొత్తదనం, ఉత్కంఠ లేకపోవడంతో ప్రేక్షకులు భయపడటానికి బదులు ఆ సన్నివేశాలను సాంకేతికంగా విశ్లేషించడం ప్రారంభించారు. మేకప్ ఎలా ఉంది, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా ఇచ్చారు, కెమెరా యాంగిల్ ఎలా ఉందో గమనిస్తూ ఒక విశ్లేషకుడిలా ఆలోచిస్తున్నారు.

సినీ ప్రేమికులు మాత్రం హర్రర్ బయపెట్టకపోవడానికి కారణం ప్రజలు అలియాస్ ప్రేక్షకులు నిత్యం జీవితమనే హర్రర్ తో యుద్ధం చేయడమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా హర్రర్ జోనర్ కూడా మెప్పిస్తే సినీ ప్రేమికులు, ప్రేక్షకులంతా అదృష్టవంతులు ఉండరు.

 

[Why People Are Not Afraid Of Horror Movies, Why people stop fearing horror movies, Horror movie psychology, Telugunews, TeluguCinema, Tollywood, Tollywood News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com