TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

డైరెక్టర్ స్పెషల్ రిక్వెస్ట్: ‘వృషకర్మ’ మొదటి 10 నిమిషాలు మిస్ అవ్వొద్దు.!

Nov 28, 2026 5:54PM

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచగా, తాజాగా దర్శకుడు కార్తీక్ దండు చేసిన ఓ రిక్వెస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమా చూడటానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు మొదటి 10 నిమిషాలు మాత్రం అస్సలు మిస్ కావొద్దని ఆయన కోరారు.

తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కార్తీక్ దండు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మీడియా కూడా ఈ విషయాన్ని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలని కోరారు. కొంతమంది థియేటర్లకు ఆలస్యంగా వస్తుంటారని, అలా వచ్చి సినిమా మొదటి పది నిమిషాలు మిస్ అయితే కథలోని అసలు ఫ్లోను అర్థం చేసుకోవడం కష్టమవుతుందని ఆయన చెప్పారు.

అంటే సినిమా ప్రారంభంలోనే కథకు చాలా కీలకమైన అంశాలను చూపించబోతున్నారన్నమాట. మొదటి పది నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు తర్వాత కథను అర్థం చేసుకోవడానికి ఎంత ముఖ్యమో దర్శకుడి మాటలతో తెలుస్తోంది. అందుకే టికెట్ బుక్ చేసుకున్నవాళ్లు సినిమా మొదలయ్యే సమయానికే థియేటర్‌లో ఉండాలని ఆయన సూచిస్తున్నారు.

‘విరూపాక్ష’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కార్తీక్ దండు ఈసారి ‘వృషకర్మ’తో మిస్టికల్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య ఇందులో హీరోగా నటిస్తుండగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపించనున్నారు. స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో నటిస్తున్నారు. జయరామ్, బేబీ కియారా ఖన్నా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇది కూడా చదవండి: వృషకర్మ ట్రైలర్‌.. పాన్ ఇండియా షేక్ అవుతుందేమో.!

‘వృషకర్మ’ డిసెంబర్ 4, 2026న థియేటర్లలో విడుదల కానుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథలో మిస్టరీ, థ్రిల్‌తో పాటు కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నామని చిత్రబృందం చెబుతోంది.

మొత్తానికి దర్శకుడు మొదటి పది నిమిషాలు మిస్ కావద్దని చెప్పడంతో ‘వృషకర్మ’పై ఆసక్తి మరింత పెరిగింది. అసలు ఆ మొదటి పది నిమిషాల్లో ఏం చూపించబోతున్నారు? తెలియాలంటే డిసెంబర్ 4 వరకు వేచి చూడాల్సిందే.

మీకు నచ్చవచ్చు: 
ఇరుముడి 100 డేస్ గిఫ్ట్.. రవితేజ ఫ్యాన్స్‎కు మర్చిపోలేని ట్రీట్.!
తెలుగు సినిమాకు మంచి రోజులు వస్తాయా.?

 

 

 

[Vrushakarma, First 10 Minutes, Karthik Dandu, Naga Chaitanya, Meenakshi Chaudhary]

 

google-ad-img