Home

»

Latest News

The Kashmir Files: మమతా బెనర్జీ ఓటమిపై కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు సంచలన వీడియో రిలీజ్ 

May 5, 2026 2:36PM

 

 

ఎందుకు! ఏమిటి! ఎలా! అని ఆలోచించే లోపే బెంగాల్ ప్రజలు 'దీదీ తేరా దీవర్ దీవానా' అనే సాంగ్  పాడుకుంటూ తమ ప్రియమైన దీదీ మమతా బెనర్జీ కి సెండ్ ఆఫ్ చెప్పారు. ఈ విషయంలో మమతా బెనర్జీ కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో తెలియదు గాని 'దీదీ గురించి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు 'ది కాశ్మీర్ ఫైల్స్ ఫేమ్  వివేక్ అగ్నిహోత్రి రిలీజ్ చేసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో అలా రీలీజ్ అయ్యిందో లేదో నెటిజన్స్ ని టైం చూసుకునే తీరిక కూడా లేకుండా చేస్తుంది. మరి ఆ వీడియోలో ఏముందో చూద్దాం

ఎవరకి తెలియని కొన్ని విషయాలంటూ  రిలీజ్ చేసిన వీడియోలో వివేక్ మాట్లాడుతు కాశ్మీర్ ఫైల్స్(The Kashmir Files)రిలీజ్ తర్వాత మమతా బెనర్జీ  నన్ను పశ్చిమ బెంగాల్ నుంచి నిషేధించారు.సినిమా కూడా రిలీజ్ కానివ్వలేదు. ది బెంగాల్ ఫైల్స్ చిత్రాన్ని కూడా అడ్డుకున్నారు. కనీసం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా జరగనివ్వలేదు. నాతో పాటు చిత్ర యూనిట్ పై దాడులు జరిగాయి. ఎఫ్ ఐఆర్ నమోదు చెయ్యడంతో పాటు గవర్నర్ చేతుల మీడియా అవార్డు తీసుకోనివ్వలేదు.  ప్రజాస్వామ్య దేశంలో ఒక దర్శకుడిని ఇలా నియంత్రించడం భావప్రకటనా స్వేచ్ఛని  హరించడమే. కానీ బెంగాల్ ఫైల్స్ చిత్రాన్ని బెంగాల్ వ్యాప్తంగా సాధ్యమైనంత ఎక్కువ మందికి రహస్యంగా చూపించాం. మా శక్తి మేర పోరాడినందుకు విజయం రూపంలో తగిన ప్రతిఫలం దక్కిందని చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


Also read: Toxic: టాక్సిక్ లోని బోల్డ్ సీన్స్ పై సంచలన రిప్లై ఇచ్చిన కియారా అద్వానీ 

 వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' మరియు 'ది ఢిల్లీ ఫైల్స్' చిత్రాలు బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా కాశ్మీరీ పండిట్ల మారణకాండని  చూపిస్తూ తీసిన కాశ్మీర్ ఫైల్స్ పై మమతా బెనర్జీ అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. మరి ది బెంగాల్ ఫైల్స్ పబ్లిక్ గా థియేటర్స్ లో రిలీజ్ అవుతుందేమో చూడాలి.



 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com