
స్టార్ హీరో సూర్య, మమిత భైజు, రాధిక, వెంకీ అట్లూరి, సితార ఎంటర్ టైన్ మెంట్ కాంబోలో వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ వరల్డ్ వైడ్ గా వీరవిహారం చేస్తుంది. శనివారం, ఆదివారం రోజు అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్స్ తో దర్శనమిచ్చాయి. బ్లాక్ లో టికెట్స్ అమ్మే వాళ్ళు సైతం ఈ సారి అమ్మేది లేంటూ వాళ్ళు కూడా ఫ్యామిలీతో విశ్వనాధ్ అండ్ సన్స్ ని చూస్తున్నారు. దీన్ని బట్టి విశ్వనాధ్ సునామిని అర్ధం చేసుకోవచ్చు.
మొదటి మూడురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 32 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం, రెండవ రోజు శనివారం ఏకంగా 44 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. దీంతో రెండు రోజుల్లోనే 75 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆదివారం మరింత జోరు చూపిస్తూ.. 45 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. దీంతో ఫస్ట్ వీకెండ్ లోనే ఏకంగా 120 కోట్లకు గ్రాస్ తో రికార్డు సృష్టించింది. యూఎస్ (US) బాక్సాఫీస్ వద్ద అతివేగంగా 1 మిలియన్ డాలర్ మార్కును దాటి సూర్య కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది.
ఈ ఘన విజయానికి సూర్య ప్రదర్శించిన వన్ మ్యాన్ షో పెర్ ఫార్మెన్స్. బడా మిలినీర్ సంజయ్ విశ్వనాధ్ గా సూర్య సినిమా ఫస్ట్ నుంచి చివరి దాకా ఒకే మోడ్ లో నటించాడు. అసలు అలాంటి పెర్ఫార్మ్ చెయ్యాలంటే కత్తి మీద సామే. ఒక రకంగా నటనకే నటన నేర్పాడని చెప్పవచ్చు . 'మాడి' గా మమితా బైజు, సంజయ్ విశ్వనాధ్ తల్లిగా రాధికా శరత్‌కుమార్ పెర్ఫార్మ్ కూడా ఒక రేంజ్ లో ఉంది. జి. వి. ప్రకాష్ కుమార్ అందించిన హృదయానికి హత్తుకునే పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రతి సీన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. నాలుగుపదుల వయసు దాటిన బడా మిలినియర్ సంజయ్ విశ్వనాధ్ కి, అతని కొడుక్కి, అబ్రాయిడ్ దేశంలో మెడిసిన్ చదివే మాగికి మధ్య జరిగిన కథనే విశ్వనాధ్ అండ్ సన్స్.
viswanath And Sons, Suriya, mamitha Bhaiju, Radhika, Venki ATluri
.webp)





