
తుఫాన్ వచ్చే ముందు వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అంతే ప్రశాంతంగా విశ్వనాధ్ అండ్ సన్స్ వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద పెను తుఫాను సృష్టిస్తుంది. సృష్టించడమే కాదు ఫ్యామిలీ సినిమాలు ఈ రోజుల్లో చూడరేమో అనుకునే వాళ్ల కళ్ళు తెరిపించి, అలాంటి వాళ్ళని సైతం రిపీట్ ఆడియెన్స్ గా మార్చేసింది. దీన్ని బట్టి విశ్వనాధ్ అండ్ సన్స్ సునామి అర్ధం చేసుకోవచ్చు.
తెలుగు ,తమిళ్ తో సహా సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకి పైగా గ్రాస్ ని దాటి 200 కోట్ల క్లబ్ అందుకోవాలని ఆశపడుతోంది. ఆశపడే హక్కు కూడా తనకి ఉందని ట్రేడ్ సర్కిల్స్ రిపోర్ట్ చెప్తున్నాయి. అయితే యూఎస్ మార్కెట్ లో లేటెస్ట్ గా 2 మిలియన్ యూఎస్ డాలర్స్ గ్రాస్ మార్క్ ని దాటేసి అదరగొట్టింది. ఇందులో తెలుగు వెర్షన్ నే అధికంగా ఉండడం విశేషం. ఈ విషయాన్ని యుఎస్ లో రిలీజ్ చేసిన శ్లోకా ఎంటర్ టైన్ మెంట్ అధికారకంగా ప్రకటించింది.
Also Read: తమన్ గొప్ప మనస్సు.. 12 కోట్లతో వృద్ధాశ్రమం నిర్మాణం
పెళ్లిపై మంచి అభిప్రాయం లేనినాలుగుపదుల వయసు దాటిన సంజయ్ విశ్వనాథన్ అనే మిలినియర్, తన వంశానికి వారసత్వం కోసం సరోగసి ద్వారా ఒక అబ్బాయిని తెచ్చుకుంటాడు. అందుకు ఫారిన్ కంట్రీ అబ్రాయిడ్ కి చెందిన మ్యాగీ అనే ఇరవైసంవత్సరాల పెళ్లి కానీ అమ్మాయి తన గర్భాన్ని అద్దెకి ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే విశ్వనాధ్ అండ్ సన్స్ .రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా జీవి ప్రకాష్ సంగీతం అందించాడు. నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మాణంలో వెంకీ అట్లూరి తెరకెక్కించాడు.
Vishwanath And Sons, Suirya, Mamitha Bhaiju





