
కరుప్పు అలియాస్ వీరభద్రుడుతో హిట్ జోష్ లో ఉన్న సూర్య మరో రెండు రోజుల్లో 'విశ్వనాథ్ అండ్ సన్స్' తో థియేటర్స్ లో ల్యాండ్ అవుతున్నాడు. టైటిల్ పాజిటివ్ గా ఉండటంతో పాటు పరాజయానికి ఆమడ దూరంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న వెంకీ అట్లూరి దర్శకుడు కావడం, ప్రచార చిత్రాలు బాగుండటంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు విశ్వనాథ్ అండ్ సన్స్ రాక కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ రివ్యూ ఇదేనంటూ ఒక న్యూస్ ఫిలిం సర్కిల్స్, సోషల్ మీడియాలో చాలా కాన్ఫిడెన్స్ గానే చక్కర్లు కొడుతుంది.
సెన్సార్ బోర్డు పూర్తి చేసుకుని 'U/A 13+' సర్టిఫికెట్‌ని పొందిన విశ్వనాథ్ అండ్ సన్స్ లో సూర్య 40 ఏళ్లకు పైబడిన సంజయ్ విశ్వనాథ్ అనే ఇంటర్నేషనల్ పిస్టల్ షూటర్‌గా కనిపించనున్నారు. సరోగసి పద్ధతి ద్వారా జన్మించిన అతని కుమారుడు ఒక అరుదైన తీవ్రమైన వ్యాధి బారిన పడటంతో కథలో ప్రధాన మలుపు ప్రారంభమవుతుంది. ఆ చిన్నారి ప్రాణాలను కాపాడుకోవాలంటే తక్షణమే బోన్ మ్యారో డోనర్ కావాల్సి వస్తుంది. ఆ మ్యాచ్ అయ్యే డోనర్ కోసం అమెరికాలో ఉన్న మ్యాడీ (మమితా బైజు)ని ఎంపిక చేస్తారు. బాబు సర్జరీ కోసం సంజయ్, మ్యాడీ కలసి సాగించే ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ జర్నీయే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. ఈ జర్నీ క్రమంలో 20 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, సంజయ్ వ్యక్తిత్వం నచ్చి మ్యాడీ ప్రేమిస్తుంది. ఆ వయసు వ్యత్యాసం, సమాజం నుండి వచ్చే ప్రశ్నల వల్ల సంజయ్ ఆ ప్రేమను తిరస్కరించినప్పటికీ, వారిద్దరి మధ్య సాగే కోర్ ఎమోషన్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని సెన్సార్ సభ్యుల టాక్.
ఫస్ట్ హాఫ్‌లో ఎంటర్టైన్‌మెంట్, పిస్టల్ షూటింగ్ స్పోర్ట్స్ నేపథ్యం చాలా ఫ్రెష్‌గా ఉంటే, సెకండ్ హాఫ్‌లో వచ్చే ప్రధాన ట్విస్ట్ అండ్ బోన్ మ్యారో సర్జరీ సీన్స్ కంటతడి పెట్టిస్తాయని సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించగా రవీనా టాండన్, రాధిక శరత్ కుమార్, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నిమిష్ రవి విజువల్స్ మూవీకి ప్రాణం పోశాయని అంటున్నారు. మరి ఇదే నిజమైతే 'లక్కీ భాస్కర్' సక్సెస్ తర్వాత వెంకీ అట్లూరి మరోసారి సెంటిమెంట్, రోమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ సమపాళ్లలో మేళవించి బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్‌బస్టర్ ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. డ్యూరేషన్ 2 గంటల 28 నిమిషాలు.
Vishwanath And sons, Suriya, Mamitha Bhaiju, Venki Atluri






