
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కొంత కాలం నుంచి వరుస పరాజయాలని అందుకుంటున్నాడు. పరాజయాల విషయంలో నేను ముందంటే ముందు అని ఒక చిత్రాన్ని మించి మరో చిత్రం ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుంది. కాని కొత్త సినిమాల అనౌన్స్ మెంట్ మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం విశ్వక్ సేన్ తన స్వీయ దర్శకత్వంలో కల్ట్' అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు మరో కొత్త చిత్రం విశ్వక్ ఖాతాలోకి వచ్చినట్టుగా సినీ సర్కిల్స్ ల్లో చర్చలు జరుగుతున్నాయి.
'35 చిన్న కథ కాదు' లాంటి ఫ్యామిలీ డ్రామాతో విమర్శకులు,ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్న దర్శకుడు నంద కిషోర్ ఈమని.. ఈ దర్శకుడితోనే విశ్వక్ సేన్ మూవీ చేయబోతున్నాడని, ఈ సినిమాకి సంబంధించిన ప్రాథమిక చర్చలు ఇప్పటికే విజయవంతంగా పూర్తవ్వడంతో పాటు విశ్వక్ కి కథాంశం వినగానే బాగా నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటనని గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్. ప్రముఖ నిర్మాత ధీరజ్ మొగిలినేని ప్రతిష్టాత్మకంగా నిర్మించబో తున్నాడని వార్తలు వస్తున్నాయి.
నంద కిషోర్ తన మొదటి సినిమా '35 చిన్న కథ కాదు'తో క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకున్నారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా మనసును తాకే ఎమోషన్స్, బలమైన కథనంతో థియేటర్లలో ప్రేక్షకులను మంత్రముగ్ధులని చేశాడు . .ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ కలవడం సినీ ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తిని పెంచుతోంది. విశ్వక్ సేన్ మాస్ అండ్ ఎనర్జెటిక్ ఇమేజ్‌కు తగినట్లుగానే, పుష్కలమైన వినోదంతో పాటు బలమైన ఎమోషనల్ డెప్త్ ఉన్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మాస్ విశ్వక్, క్లాస్ ఎమోషనల్ డైరెక్టర్ కాంబో తెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో అని టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
also read: అమితాబ్ బచ్చన్ హెల్త్ ట్వీట్ కలకలం.. పోరాడేవారే ఎప్పటికి విజేతలు
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఇతర పూర్తి వివరాలు మేకర్స్ చేయబోయే అధికారిక ప్రకటన ద్వారా వెల్లడికానున్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత ధీరజ్ మొగిలినేని ఈ ప్రాజెక్ట్‌ని బిగ్ స్కేల్‌లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.. ఈ సరికొత్త థ్రిల్లర్ చిత్రానికి ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ మాటలు అందిస్తుండగా, రవి బస్రూర్ అద్భుతమైన సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇక ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డులో 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా నిలిచింది.







