Home

»

Latest News

Vishnu Priya: అప్పట్లోనే విష్ణుప్రియ రచ్చ.. 8 ఏళ్ళ క్రితం ఫన్ బకెట్‌లో కామెడీ చూశారా?

Apr 17, 2026

యాంకర్ విష్ణుప్రియ (Vishnu Priya) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పలు టీవీ షోలతో పాపులారిటీ దక్కించుకుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ పేరుతో హాట్ ఫోటోలను పోస్ట్ చేసి, డబ్బు సంపాదిస్తుండటంపై ఇటీవల విమర్శలు కూడా వచ్చాయి. 

ఇదిలా ఉంటే తాజాగా విష్ణుప్రియకు సంబంధించిన ఎనిమిది ఏళ్ల క్రితం నాటి ఒక వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అప్పట్లో 'తెలుగువన్' యూట్యూబ్ ఛానల్‌లో సంచలనం సృష్టించిన 'ఫన్ బకెట్'(Fun Bucket)లో  విష్ణుప్రియ చేసిన కామెడీ స్కిట్లు ఇప్పుడు నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తున్నాయి.

విష్ణుప్రియ కెరీర్ ప్రారంభంలో యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, కామెడీ స్కిట్స్ ద్వారా బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా ‘ఫన్ బకెట్’లో ఆమె చేసిన కామెడీ స్కిట్లు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే. 

సుమారు ఎనిమిదేళ్ల క్రితం విష్ణుప్రియ ఫన్ బకెట్ వీడియోలలో చురుగ్గా పాల్గొంది. ముఖ్యంగా ఆమెలోని నాచురల్ కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఆ వీడియోలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సిస్టర్ గా, గర్ల్ ఫ్రెండ్ గా, వైఫ్ గా ఆమె చేసిన నటన అప్పట్లోనే యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. 

టీవీలో 30 అడుగుల పాము గురించి తమ్ముడితో మాట్లాడే సీన్, భర్తతో లాప్‌టాప్ డాక్యుమెంట్స్ విషయంలో చేసే గొడవ వంటివి ఇప్పటికీ నవ్వులు పూయిస్తున్నాయి. ప్రస్తుతం విష్ణుప్రియ స్టార్ యాంకర్ గా ఎదిగినా, ఆ పాత వీడియోల్లోని ఆమె అమాయకత్వం, నటనను చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

తన అల్లరి, స్పాంటేనియస్ డైలాగ్స్‌తో ఎనిమిదేళ్ల క్రితమే విష్ణుప్రియ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, కామెడీని కూడా పండించగలనని ఆమె అప్పట్లోనే నిరూపించుకుంది.

సోషల్ మీడియాలో మళ్ళీ హల్చల్ చేస్తున్న ఈ వీడియోలు, విష్ణుప్రియ అభిమానులకు ఒక మంచి థ్రోబాక్ మెమరీగా నిలుస్తున్నాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా 'తెలుగువన్' (TeluguOne) యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com