Home

»

Latest News

బోల్డ్ కామెంట్స్ : ఇలా కూడా మాట్లాడతారా.. నా ఫ్రెండ్స్ లో వాళ్లే ఎక్కువ!

Aug 29, 2026 3:07PM

 

ప్రముఖ యాంకర్, నటి విష్ణుప్రియ సెప్టెంబర్ 4 న అల్లరి నరేష్ తో కలిసి  'రంభ ఊర్వశి మేనకా'  అనే మూవీతో సందడి చేయడానికి రెడీ అవుతుంది. రెడీ అవుతుండటమే కాదు మేనకా క్యారక్టర్ లో తనే కనిపిస్తుంది. మరి ఈ లెక్కన తన ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. రీసెంట్ గా ఆ చిత్ర ప్రమోషన్స్ లో విష్ణు ప్రియ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాని హీట్ మోడ్ లో ఉంచుతున్నాయి.

విష్ణుప్రియ మాట్లాడుతు ' నాకు బాయ్ ఫ్రెండ్స్ కంటే గర్ల్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ. అంతేకాకుండా నా ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్స్ పొందిన దాదాపు 5,000 మంది అభిమానుల్లో చాలా మంది అమ్మాయిలే ఉన్నారు. నా గర్ల్ ఫ్రెండ్స్ మరియు లేడీ ఫాలోవర్స్ నా వీడియోలను క్రమం తప్పకుండా చూస్తారు. ఎలాంటి అవుట్‌ఫిట్స్ ధరించాలి, ఎలాంటి స్టైలింగ్ ఫాలో అవ్వాలో కూడా సలహాలు ఇస్తుంటారని విష్ణు ప్రియా  చెప్పుకొచ్చింది. విష్ణు ప్రియకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ (13 లక్షల) కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. 


Also Read: వైరల్ న్యూస్: స్టార్ హీరోపై జయప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలు వెలుగులోకి 

 

 

[Vishnu priya, Rambha Urvashi Menaka, Girl friends, Bold Comments, TeluguCinemaNews, TeluguCinema,Tollywood]


 

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com