యూపీ సీఎంతో మంచు విష్ణు భేటీ.. కన్నప్ప టైం స్టార్ట్!
on Apr 9, 2025

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతోన్న చిత్రం 'కన్నప్ప' (Kannappa). మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన కన్నప్ప మూవీ వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా వాయిదా పడింది. తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
కన్నప్ప చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లాంచ్ చేయడం విశేషం. మోహన్ బాబు, ప్రభుదేవాతో కలిసి లక్నో వెళ్లిన విష్ణు.. యోగి ఆదిత్యనాథ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యోగి కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్ ను లాంచ్ చేశారు. మోహన్ బాబు, విష్ణు సోషల్ మీడియా వేదికగా యోగికి కృతఙ్ఞతలు తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



