Home

»

Latest News

Virosh: బుజ్జితల్లితో విజయ్, రష్మిక క్యూట్ మూమెంట్!

Mar 20, 2026

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే "విజయ్-రష్మిక పెళ్ళి భోజనానికి నన్ను పిలవలేదని, వారి ఫ్యాన్ అయిన నన్ను కూడా పిలవాలి కదా" అంటూ ఓ చిన్నారి బుజ్జి బుజ్జి మాటలతో వీడియో చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా, విజయ్ కి కూడా చేరువైంది.

ఆ చిన్నారి వీడియో కింద విజయ్ ఓ క్యూట్ కామెంట్ చేశాడు. "బుజ్జితల్లి.. ఇంటికి పిలుస్తా లంచ్ కి.. నీ ఫేవరెట్ ఫుడ్, స్వీట్స్ నాకు చెప్పు, అన్నీ ఇంట్లో చేపించి మంచిగా తిందాము" అని విజయ్ రిప్లై ఇచ్చాడు.

విజయ్ మాట ఇవ్వడమే కాదు, ఆ మాట మీద నిలబడ్డాడు కూడా. రీసెంట్ గా ఆ చిన్నారిని ఇంటికి పిలిచి.. తనకి ఇష్టమైన లడ్డులు, పులిహోర వంటి ఐటమ్స్ స్వయంగా వడ్డించారు. విజయ్, రష్మిక ఆ చిన్నారిని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ముద్దాడటమే కాకుండా, ఎత్తుకొని సరదాగా కుబుర్లు చెప్పారు. 

ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి బుజ్జి కోరికను తీర్చి, తనకు జీవితంలో మర్చిపోలేని మెమొరీ ఇచ్చారంటూ.. విజయ్, రష్మికపై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: క్రేజీగా 'హ్యాపీ రాజ్' ట్రైలర్.. అబ్బాస్ కంబ్యాక్ అదిరిందిగా!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com