Home

»

Latest News

అసలు బ్రతికి వేస్ట్: సందీప్ రెడ్డి థాంక్యూ చెప్పడంపై విజయ్ దేవరకొండ రియాక్షన్.!

Aug 31, 2026 11:26AM

ఒకరు మనల్ని నమ్మి అవకాశం ఇచ్చినప్పుడు.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో.. అవకాశం ఇచ్చినవారిని గుర్తుపెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ విషయంలో విజయ్ దేవరకొండ గొప్పతనం మరోసారి రుజువైంది. 'అర్జున్ రెడ్డి'తో తనను ఓవర్ నైట్ స్టార్ ను చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై తన అభిమానాన్ని మళ్ళీ చాటుకున్నారు విజయ్.

సందీప్ రెడ్డి సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన 'రోమాంచకం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరి చేత క్లాప్స్ కొట్టించాయి.

సందీప్ పై  నాకున్న ప్రేమను కేవలం మాటల్లో చెప్పలేనని, మా ఇద్దరి మధ్య ఉన్నది సాధారణ డైరెక్టర్-యాక్టర్, బ్రదర్ లేదా ఫ్రెండ్ రిలేషన్‌షిప్ కాదని, అంతకుమించి అనుబంధమని స్పష్టం చేశారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా రోజులను గుర్తు చేసుకుంటూ, ఆ సమయంలో తామిద్దరం కలిసి ఒక పెద్ద యుద్ధమే చేశామని తెలిపారు. సినిమా మొదలుపెట్టినప్పుడు తమ వద్ద ఎలాంటి డబ్బులు, ఇండస్ట్రీలో ఇన్ఫ్లుయెన్స్ లేవని, పెళ్లి చూపులు సినిమా కూడా అప్పటికి రిలీజ్ కాలేదని నాటి రోజులను గుర్తుచేసుకున్నారు.

‘అర్జున్ రెడ్డి’ చిత్రం వర్కవుట్ కాకపోతే ఇద్దరికీ పిచ్చి పట్టడం ఖాయమని భావించిన విషయాన్ని విజయ్ బయటపెట్టారు. సందీప్ మీద ఉన్న నమ్మకంతో ఆయన అన్న ప్రణయ్, తండ్రి ప్రభాకర్ గారు తమకున్న సొంత పొలాన్ని పెట్టి మరీ సినిమా తీశారని, అంత పెద్ద రిస్క్ తీసుకున్నారని చెప్పారు. సందీప్ తన కోసం ఎంతవరకు అయినా వెళ్తాడని, తాను కూడా సందీప్ కోసం ఎంతదూరమైనా వెళ్తానని చెప్పారు. ఈ ఈవెంట్ కి వచ్చినందుకు సందీప్ థాంక్స్ చెప్తుంటే అనిపించింది.. సందీప్ పిలిచినప్పుడు నేను రాకపోతే బ్రతికి కూడా వేస్ట్ అని విజయ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

 

 

 

[Vijay Deverakonda, Emotional Speech, Romanchakam Pre Release Event, Sandeep Reddy Vanga, Arjun Reddy, Telugu Cinema News, Telugu News, Tollywood]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com