రజనీకాంత్ కి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు కదా
on Oct 9, 2024
దసరా సందర్భంగా సిల్వర్ స్క్రీన్ వద్ద కొత్త సినిమాల హంగామా మొదలుకాబోతుంది.ఈ నెల పదకొండున గోపిచంద్, శ్రీను వైట్ల క్రేజీ కాంబోలో వస్తున్న విశ్వం(viswam)సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన మా నాన్న సూపర్ హీరో(maa nanna super hero)విడుదల కాబోతుండగా పన్నెండు న సుహాస్ నుంచి జనక అయితే గనక(janaka aithe ganaka)రాబోతుంది.ఈ మూడింటి కంటే ఒక రోజు ముందుగా పదవ తేదీన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్(rajanikanth)వన్ మాన్ షో వేట్టయాన్(vettaiyan)విడుదల కాబోతుంది.
జనరల్ గా రజనీ నుంచి సినిమా వస్తుందంటే తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి బజ్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు రజనీ సినిమా థియేటర్స్ లోకి వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తుంటారు. కానీ ఇప్పుడు వేట్టయాన్ విషయంలో తెలుగునాట అంతగా బజ్ లేదనిపిస్తుంది.బుక్ మై షో వంటి ఆన్ లైన్ టికెట్ యాప్ లో కూడా పెద్దగా క్రేజ్ కనపడటం లేదు. రజనీ నుంచి జైలర్ వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా అయినా కూడా ఎందుకనో అంతగా ఆసక్తి కనపరచటం లేదు.వేట్టయాన్ టీజర్, ట్రైలర్ లు మరీ అంత ఎగ్జైటింగ్ గా అనిపించకపోవడం ప్రధాన కారణం అని కూడా సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.మరి రిలీజ్ రోజు మంచి టాక్ తెచ్చుకుంటే కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.
సూర్య తో జై భీం వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన టి జే జ్ఞానవేల్(tj gnanavel)దర్శకత్వంలో తెరకెక్కుతున్న వేట్టయాన్ లో రజనీకాంత్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో చేస్తుండగా అమితాబ్ బచ్చన్, ఫాహద్, రానా, దుషారా విజయన్, రితికా సింగ్, మంజు వారియర్ లు ప్రధాన పాత్రల్లో చేస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందించాడు.
Also Read