
సౌత్ చలన చిత్ర పరిశమ్రలో సూర్య(Suriya)కి ఉన్న క్యాపబిలిటీ తెలిసిందే. హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా సినిమా, సినిమాకి భిన్నమైన షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో కనిపిస్తూ వస్తున్నాడు. ఈ కోవలోనే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'వీరభద్రుడు' తో ఈ నెల 14 న థియేటర్స్ లో అడుగుపెట్టనున్నాడు. హిట్ మోడ్ లో ఉన్న ఆర్ జె బాలాజీ(RJ Balaji)దర్శకుడు కావడంతో వీరభద్రుడుపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ విడుదలయ్యింది..
ట్రైలర్ చూస్తుంటే, సూర్య మరోసారి తన విశ్వరూపాన్ని చూపించబోతున్నాడని స్పష్టమవుతోంది. ఇందులో ఆయన రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నాడు. డైలాగ్స్ కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా దేవుడే దిగి వచ్చినా కోర్టు ప్రోసిజర్ ని మార్చలేడా, వచ్చాను కదరా పిచ్చకొట్టుడు కొడతా, అయ్యో వచ్చింది తెల్ల వాళ్ళ దేవుడైతే క్షమాపణ అడగవచ్చు. కానీ వచ్చింది భద్రుడు, వీరభద్రుడు ముక్కలు ముక్కలు చేసి కుక్కలకి పడేస్తాడు అనే డైలాగ్స్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ ని ఉర్రుత లూగిస్తున్నాయి.
Also read: Jana Nayagan: జననాయగన్ ఓటిటి డీల్ ఇదే! షాకింగ్ ఫిగర్
సూర్య ఇటీవల కాలంలో వరుస ప్రయోగాలు చేసుకుంటూ వచ్చాడు. అయితే ‘వీరభద్రుడు' మాత్రం ఆయన నుంచి అభిమానులు ఆశించే పక్కా కమర్షియల్ మాస్ మూవీ అని తెలుస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద వీరభద్రుడు ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి. ట్రైలర్‌తో సినిమాపై ఉన్న హైప్ ఒక్కసారిగా పెరిగింది. సూర్య సరసన త్రిష(Trisha)జత కట్టింది.






