రికార్డు స్థాయిలో 'మట్కా' బిజినెస్.. వరుణ్ తేజ్ కమ్ బ్యాక్ ఇస్తాడా?
on Nov 13, 2024
కెరీర్ స్టార్టింగ్ లో విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej). అయితే కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. వరుణ్ తేజ్ సోలో హీరోగా చేసిన చివరి మూడు సినిమాలు 'గని', 'గాండీవధారి అర్జున', 'ఆపరేషన్ వాలెంటైన్' ఘోర పరాజయం పాలయ్యాయి. దీంతో రేపు(నవంబర్ 14) విడుదల కానున్న 'మట్కా' (Matka) పైనే ఆశలు పెట్టుకున్నాడు వరుణ్. 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అందుకే వరుణ్ గత సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా బాగానే బిజినెస్ చేసింది. (Matka Business)
వరుణ్ తేజ్ ప్రస్తుత మార్కెట్ తో పోలిస్తే, 'మట్కా' థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.15 కోట్ల బిజినెస్ చేయగా, వరల్డ్ వైడ్ గా రూ.17.50 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అంటే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.18 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. వరుణ్ తేజ్ గత చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్' వరల్డ్ వైడ్ గా రూ.5 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. అయినప్పటికీ 'మట్కా'కి రూ.17.50 కోట్ల బిజినెస్ జరగడం అనేది విశేషమే. 'మట్కా' టీజర్, ట్రైలర్ ఆకట్టుకొని కంటెంట్ ప్రామిసింగ్ గా కనిపించింది. అందుకే బిసినెస్ పరంగా ఎఫెక్ట్ పడలేదని చెప్పవచ్చు. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి, వరుణ్ తేజ్ కి కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందేమో చూడాలి.
Also Read