Home

»

Latest News

చేతికర్రతో 'కొరియన్ కనకరాజు' ఈవెంట్‌కు వరుణ్ తేజ్.. పెదనాన్నలా డ్యాన్స్ చేయాలనుకున్నా.!

Jul 20, 2026 10:12AM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన విభిన్నమైన కథాంశాలతో, వైవిధ్యమైన పాత్రలతో ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. తాజాగా ఆయన నటించిన సరికొత్త చిత్రం 'కొరియన్ కనకరాజు' నుంచి 'రాస గుమ్మడి' అనే ఎనర్జిటిక్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ అనంతపురంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో వరుణ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన పెద్దనాన్న, మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన డ్యాన్స్ గురించి, ఆయన స్ఫూర్తితో తాను చేసిన సరికొత్త ప్రయత్నం గురించి వరుణ్ తేజ్ మాట్లాడిన మాటలు మెగా అభిమానుల హృదయాలను ఎంతగానో హత్తుకుంటున్నాయి. 

వరుణ్ తేజ్ మాట్లాడుతూ, "కొరియన్ కనకరాజు’ చిత్రీకరణ అనంతపురంలోనే జరిగింది. అందుకే ఈ పాటను ఇక్కడే రిలీజ్ చేయాలని అనుకున్నాం. అభిమానుల సమక్షంలో ఇలా పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మీ అందరికీ ఈ పాట నచ్చిందని ఆశిస్తున్నాను." అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ పాటలో వరుణ్ తేజ్ తనదైన స్టెప్స్ తో అదరగొట్టారు. దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని ఆయన వివరిస్తూ, "పెద్దనాన్న గారిని (చిరంజీవి) మైండ్ లో పెట్టుకుని ఆయనలాగా ఎప్పుడో ఒకసారి కొంచెమైనా డ్యాన్స్ చేయాలని ట్రై చేశాను. ఈ సినిమా చేయడం, ముఖ్యంగా ఈ సాంగ్ చేయడం నేను చాలా ఎంజాయ్ చేశాను" అని తన మనసులోని మాటను అభిమానులతో పంచుకున్నారు. 

చిరంజీవి అద్భుతమైన గ్రేస్, ఆయన డ్యాన్స్ మూమెంట్స్ అంటే థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలే. అలాంటిది వరుణ్ తేజ్ స్వయంగా తన పెద్దనాన్నను ఆదర్శంగా తీసుకుని ఈ పాటలో స్టెప్స్ వేశానని చెప్పడం అభిమానుల్లో జోష్ నింపింది.

వరుణ్ తేజ్ తన నెక్స్ట్ మూవీ 'బరి' సెట్స్ లో గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన కాలికి సర్జరీ కూడా అయింది. అయితే గాయం ఇంకా తగ్గనప్పటికీ, చేతికర్ర పట్టుకొని ఆయన ఈవెంట్ కి రావడం విశేషం. 

"మీ ముందు ఇక్కడ స్టేజ్ పైన ఒక స్టెప్ వేద్దామని అనుకున్నాను. కానీ కాలికి గాయం ఇంకా తగ్గలేదు." అని వరుణ్ తేజ్ చెప్పారు. కాలుకు గాయం అయినప్పటికీ, అభిమానుల మీద ఉన్న ప్రేమతో, తన సినిమా మీద ఉన్న బాధ్యతతో ఆయన అనంతపురం దాకా వచ్చి ఈ వేడుకలో పాల్గొనడం ఆయన డెడికేషన్ కు నిదర్శనం అంటూ మెగా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

 

 

Chiranjeevi, Varun Tej, Korean Kanakaraju, Raasa Gummadi Song

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com