
‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయారు. ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ సినిమాలు వరుసగా నిరాశపరిచాయి. వరుస పరాజయాలతో వైష్ణవ్ తేజ్ బ్రేక్ తీసుకున్నాడు. లాస్ట్ మూవీ ‘ఆదికేశవ’ విడుదలై మూడేళ్లు అవుతున్నా.. ఇంతవరకు కొత్త సినిమా ప్రకటన రాలేదు.
నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో వైష్ణవ్ తేజ్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు టాక్. ఒక కథ నచ్చింది కదా అని వెంటనే ఓకే చెప్పకుండా.. తనకు సెట్ అయ్యే సబ్జెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా కథలు విన్న వైష్ణవ్ తేజ్.. తాజాగా రెండు కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

వైష్ణవ్ తేజ్‌ను ఆకట్టుకున్న ఆ రెండు కథలు ప్రముఖ దర్శకులు పరశురామ్, ప్రదీప్ సత్తారు వినిపించినవేనని టాక్. ఈ రెండు కథలు వైష్ణవ్‌కు నచ్చాయని.. అయితే ఇందులో ఏ సినిమాను ముందుగా పట్టాలెక్కించాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
అయితే ఈ రెండింటిలో ఒక ప్రాజెక్ట్ మాత్రం త్వరలోనే ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ పరశురామ్ చెప్పిన కథను వైష్ణవ్ తేజ్ ముందుగా ఓకే చేస్తే.. ఆ సినిమాను నిర్మాత దిల్ రాజు నిర్మించే అవకాశం ఉందట.
ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ ‘రాకా’.. గందరగోళానికి కారణమేంటి.?
[Vaishnav Tej Latest News, Vaishnav Tej Next Movie, Vaishnav Tej Parasuram, Vaishnav Tej Pradeep Sathaaru, Vaishnav Tej New Movie, Uppena Movie, Panja Vaisshnav Tej, Telugu Film News, Telugu News]





