
'గబ్బర్ సింగ్'తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హరీష్ శంకర్ కాంబినేషన్.. 12 ఏళ్ళ తర్వాత ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh)తో అలరించడానికి సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ నేడు (మార్చి 14) సాయంత్రం 6:30 గంటలకు విడుదలైంది. "ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం" అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, గన్ పట్టుకుని నడిచి వచ్చే స్టైల్ పాత 'గబ్బర్ సింగ్' రోజులను గుర్తుచేస్తున్నాయి.
పవర్, యాక్షన్, వినోదంతో నిండిన పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌ను ఈ ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ టాప్ ఫామ్‌లో కనిపిస్తూ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ట్రైలర్ అంతటా తన ట్రేడ్‌మార్క్ కరిష్మాను ప్రదర్శించారు. పంచ్ డైలాగులు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, వినోదభరితమైన క్షణాలు.. ప్రతి అంశం ప్రభావవంతంగా నిలిచి సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
మొత్తానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్‌గా అనిపిస్తోంది. హరీష్ శంకర్ మరోసారి పవన్ కళ్యాణ్ మాస్ పల్స్‌ను కరెక్ట్‌గా పట్టుకున్నారు. మార్చి 19న ఉగాది కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమనిపిస్తోంది.





