Home

»

Latest News

Pawan Kalyan: వరల్డ్ వైడ్ గా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రభంజనం.. అసలు నిజం లేటుగా బయటకి 

Apr 23, 2026 5:01PM

 

లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అని పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చెప్తే సినిమా డైలాగ్ కదా అనుకున్నాం. కానీ అక్కడ ఉంది పవన్ కదా, ఆ డైలాగ్ ని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చి రాజకీయ యవనికపై ఉన్నా కూడా సినీ రికార్డుల విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కానని అంటున్నాడు. మరి ఆ రికార్డుల డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
   

మార్చి 19 న రిలీజైన ఉస్తాద్ భగత్ సింగ్(ustaad bhagat singh)ఫ్యాన్స్, ప్రేక్షకులకి వేసవి ఫీలింగ్ ని మర్చిపోయేలా చేస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఆశించని ఫలితాన్ని అందుకోలేకపోవడమే కాకుండా పవన్ పరాజయాల లిస్ట్ లో ఎంతో శ్రద్దగా, పకడ్బందీగా  వచ్చి చేరింది. ఈ మూవీ లాస్ట్ వీక్ ఏప్రిల్ 16 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా ఓటిటి స్ట్రీమింగ్ కి వచ్చింది. అలా వచ్చిందో లేదో, నేను వచ్చింది సైలెంట్ గా ఉండటానికి కాదు రికార్డులు సృష్టించడానికి అనే రీతిలో సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఎంతలా అంటే వరల్డ్  వైడ్ గా. ఈ విషయాన్నీ నెట్ ఫ్లిక్స్ సంస్థే అధికారకంగా ప్రకటిస్తూ  పోస్టర్ రిలీజ్ చేసింది.

Rajinikanth: రజినీకాంత్ 'విజయ్'కే ఓటు వేశాడా..లోపల మాటర్ పరిస్థితి ఇదే 

సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ న్యూస్ పై ఫ్యాన్స్ స్పందిస్తు కొన్ని సార్లు రికార్డులు సృష్టించడం లేట్ అవ్వచ్చేమో గాని రికార్డులు సృష్టించడం మాత్రం పక్కా అని నెట్ ఫ్లిక్స్  పిక్ ని షేర్ చేస్తున్నారు. 

 



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com