Home

»

Latest News

UStaad Bhagat Singh: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్!.. ధురంధర్ 2 అవుట్ 

Mar 20, 2026

 


-నిన్న సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయిన ఉస్తాద్ 
-హిట్ అంటున్న ఫ్యాన్స్, మేకర్స్ 
-తొలి రోజు కల్లెక్షన్స్ ఇవేనా!

నిన్న ఉదయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్స్ 'ఉస్తాద్ భగత్ సింగ్'(UStaad Bhagat Singh)రాకతో కళకళలాడాయి. దీంతో పవన్(Pawan Kalyan)అభిమానులు ఎవరో, మూవీ లవర్స్ ఎవరో తెలుసుకోలేని విధంగా జాతర వాతావరణం తలపించింది. ఉగాది రోజు బడా హీరో సినిమా రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత సందడి వాతావరణం నెలకొని ఉంటుందో ఎంటైర్ ఇండస్ట్రీకి ఉస్తాద్ తన రాకతో కూడా చెప్పినట్లయింది. దాదాపుగా నిన్న అన్ని స్క్రీన్స్ వరల్డ్ వైడ్ గా  ఫుల్ క్లౌడ్ మరి ఫస్ట్ డే ఏ మేర కలెక్షన్స్ సాధించిందో చూద్దాం.

ఉస్తాద్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 52 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాల్లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇదే కనుక నిజమైతే పవన్ కెరీర్ లోనే మరోసారి ఉస్తాద్ తో  ఫస్ట్ డే కి సంబంధించి మరోసారి రికార్డు  కలెక్షన్స్ రాబట్టినట్టే. ఓజి కన్నా తక్కువే అయినా ఉస్తాద్ సాధారణ రేట్స్ కే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఓపెనింగ్స్ ని రాబట్టడం విశేషం. ధురంధర్ 2 ఫీవర్ తెలుగులో ఉన్నా కూడా ఉస్తాద్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని ధురంధర్ 2 దాటలేకపోయింది. కాకపోతే ఉస్తాద్ ఫస్ట్ డే కల్లెక్షన్స్ గురించి మేకర్స్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది.

also read: Dhurandhar 2 review in telugu: ధురంధర్ 2 సినిమా రివ్యూ 

టాక్ పరంగా చూసుకుంటే ఉస్తాద్ కి ప్రేక్షకుల తో పాటు మెజారిటీ రివ్యూస్ పర్వాలేదనే స్థాయిలో వస్తున్నాయి. అభిమానులు అయితే పవన్ వన్ మాన్ షో అని సినిమా హిట్ అంటున్నారు. మేకర్స్ నిన్న సక్సెస్ మీట్ ని నిర్వహించి అభిమానులకి, ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో వీకెండ్ తో పాటు లాంగ్ రన్ లో ఉస్తాద్ ఏ మేర కలెక్షన్స్ సాధిస్తుందనే ఆసక్తి అందరిలో ఏర్పడింది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com