TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

సిరివెన్నెల దాచుకున్న పాటలకు ప్రాణం.. ఆ సినిమాలో ఉపయోగిస్తున్నారు.!

Nov 27, 2026 12:01PM

తెలుగు సినిమాల్లో కొన్ని కాంబినేషన్లు వినగానే ఆసక్తి కలుగుతుంది. ఇప్పుడు అలాంటి ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో మొదలుకాబోతోంది. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కథతో ఓ కొత్త సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసి, గతంలో సినిమాల్లో ఉపయోగించకుండా దాచుకున్న సాహిత్యాన్ని ఇందులో వినియోగించబోతున్నారు.

ఈ సినిమాకు కృష్ణ మురళి దర్శకత్వం వహించనున్నారు. ఆయన దర్శకుడు కృష్ణవంశీ దగ్గర శిష్యరికం చేశారు. విభిన్న కథాంశాలతో సినిమా రూపొందించాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. శిరీష కొండమూరి (దాసరి), శ్రీధర్ అడబాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఈ సినిమాలో తనికెళ్ల భరణి, శ్రీనివాస్ వడ్లమాని, అర్చన, దివి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నటీనటుల ఎంపికతో పాటు కథ, సంగీతం విషయంలోనూ ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకంగా ఉండబోతోందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకునేలా చేస్తున్న విషయం సిరివెన్నెల సాహిత్యం. ఆయన గతంలో కొన్ని సినిమాల కోసం పాటలు రాసినా.. అవి ఉపయోగించలేదు. అలా పక్కన పెట్టిన కొన్ని పాటలను ఇప్పుడు ఈ కొత్త సినిమాలో వినియోగించనున్నారు. సిరివెన్నెల కలం నుంచి వచ్చిన ఆ పదాలు ఇన్నాళ్ల తర్వాత తెరపైకి రానుండటం విశేషం.

ఇది కూడా చదవండి: ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్.. నితిన్ కమ్‌బ్యాక్ ఇస్తాడా.?

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ పాటలకు సిరివెన్నెల తనయుడు యోగేశ్వర్ శర్మ సంగీతం అందించనున్నారు. అంటే తండ్రి రాసి దాచుకున్న సాహిత్యానికి కొడుకు స్వరాలు సమకూర్చబోతున్నారు. తండ్రీకొడుకుల మధ్య ఈ సంగీత ప్రయాణం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

మరి యండమూరి కథకు సిరివెన్నెల సాహిత్యం తోడైతే వెండితెరపై ఎలాంటి అనుభూతి అందుతుందో చూడాలి.

మీకు నచ్చవచ్చు:
ఇదేమి ముచ్చటో.. వర్కర్స్‌ భోజనం మీద జగపతిబాబు దాడి.!
బాహుబలి కాంబో రిపీట్‌.. వారణాసి తర్వాత ప్రభాస్‌తో రాజమౌళి సినిమా.!

 

 

 

[Sirivennela Seetharama Sastry, Unused Lyrics, Yandamuri Veerendranath, Yogeshwar Sharma]

 

google-ad-img