Home

»

Latest News

బండ్ల గణేష్ వెనుక ఇంత చరిత్ర ఉందా.. 24 ఏళ్ళ తరువాత బయటపడిన నిజం!

Feb 24, 2026

  • 2002లో బండ్ల గణేష్ హీరోగా సినిమా
  • అప్పట్లో ఆ లాంచ్ టాలీవుడ్ లో హాట్ టాపిక్
  • కమల్ హాసన్ లాంటి నటుడు చేయాల్సిన పాత్రలో బండ్ల
  • కొంత షూటింగ్ జరిగాక సినిమా ఎందుకు ఆగిపోయింది?
  • పెద్ద హీరో కావాల్సిన బండ్ల గణేష్ ఫేట్ మార్చింది ఎవరు?

నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారు బండ్ల గణేష్(Bandla Ganesh). ఏవో కారణాల వల్ల కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. త్వరలో రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో బండ్ల గణేష్ గురించి ఆసక్తికర న్యూస్ తెరపైకి వచ్చింది.

నిర్మాతగా మారకముందు బండ్ల గణేష్ చాలా సినిమాల్లో నటించారు. అయితే ఆయన పేరు వింటే.. కామెడీ రోల్స్, చిన్న చిన్న పాత్రలే ఎక్కువగా గుర్తుకొస్తాయి. కానీ, ఎప్పుడో 24 ఏళ్ళ క్రితమే బండ్ల గణేష్ కి హీరోగా అవకాశం వచ్చిందని, కొంత షూటింగ్ జరిగాక ఆ సినిమా ఆగిపోయిందని అతికొద్ది మందికి మాత్రమే తెలుసు.

2002లో బండ్ల గణేష్ హీరోగా 'శీనుగాడు' అనే సినిమా ఘనంగా ప్రారంభమైంది. కొంత షూటింగ్ జరిగాక సడన్ గా ఆ చిత్ర నిర్మాత చనిపోవడంతో సినిమా ఆగిపోయింది. ఆ సినిమా విడుదలై ఉంటే బండ్ల గణేష్ మంచి హీరోగా నిలదొక్కుకునే వాడనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉండేది. తాజాగా ఇదే విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు బాబ్జీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

"2002 లో సోదరుడు బండ్ల గణేష్ హీరోగా 'శీనుగాడు' అనే సినిమా నా దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత ఘనంగా ప్రారంభమయింది. ప్రముఖు హీరోలు, హీరోయిన్ లు, దర్శకులు, నిర్మాతలతో అన్నపూర్ణ స్టూడియో కిటకిట లాడింది. ఆ ప్రారంభోత్సవం జరిగిన విధానం గురించి చాలా రోజుల వరకు పరిశ్రమ వర్గాలు గొప్పగా మాట్లాడుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన బండ్ల గణేష్ గారి పాత్ర కమల్ హాసన్ లాంటి గొప్ప నటులు పోషించాల్సిన పాత్ర. కొంత షూటింగ్ జరిగాక సడన్ గా ఆ చిత్ర  నిర్మాత చనిపోవడంతో సినిమా ఆగిపోయింది. అలా జరిగి ఉండకపోతే... ఆ సినిమా అనుకున్నట్లుగా రూపొంది విడుదలయి ఉంటే మిత్రులు బండ్ల గణేష్ ఒక సక్సెస్ ఫుల్ హీరోగా తనదైన జెండాను ఎగరేసి ఉండేవారు. నాకు కూడా ఆ సినిమా దర్శకుడిగా మంచి బ్రేక్ ఇచ్చి ఉండేది. అలా పెద్ద హీరోగా సక్సెస్ సాధించాల్సిన బండ్ల గణేష్ గారు అనుకోకుండా నిర్మాతగా మారి ప్రస్తుతం ఒక అగ్ర నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం నాకు సంతోషకరం." అని దర్శకుడు బాబ్జీ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

2002లో బండ్ల గణేష్ కి హీరోగా అవకాశం రావడం, అది కూడా కమల్ హాసన్ లాంటి గొప్ప నటులు పోషించాల్సిన పాత్ర రావడం అనేది మామూలు విషయం కాదు. నిజంగానే ఆ సినిమా విడుదలై, హిట్ కొడితే.. సక్సెస్ ఫుల్ హీరోగా బండ్ల గణేష్ నిలిచేవాడేమో.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com