
యానిమల్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించి జెన్ జీ బ్యాచ్ కి ఓవర్ నైట్ స్టార్ డమ్ అంటే ఎలా ఉంటుందో చాటి చెప్పిన భామ త్రిప్తి దిమ్రి(Triptii Dimri). ఎంతో మంది యువత కలల రాణి కూడా. ఇప్పుడు ఆ పోస్ట్ ని మరింత పెంచుకునేలా పాన్ ఇండియా రెబల్ స్టార్ తో స్పిరిట్ లో జత కడుతుంది.
రీసెంట్ గా త్రిప్తి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'యానిమల్' సాధించిన భారీ విజయం నా జీవితంలో మరియు కెరీర్‌లో ఒక పెద్ద మలుపు. ఆ బ్లాక్‌బస్టర్ విజయం ఇండస్ట్రీలో ఎంతో స్వేచ్ఛని ప్రసాదించింది. యానిమల్' విడుదలకి ముందు వరకు ఇండస్ట్రీలో నాలోని నటనని, అసలైన ప్రతిభని నిరూపించుకోవడానికి సరైన అవకాశాల కోసం నిరంతరం ఎదురుచూడాల్సి వచ్చేది.అయితే ఆ ఒక్క సినిమా విజయం తర్వాత చిత్ర పరిశ్రమలో దర్శకనిర్మాతలకు నాపై నమ్మకం నూటికి నూరు శాతం పెరిగింది.ఎన్నో వైవిధ్యమైన ప్రాజెక్టులు వస్తున్నాయి. కేవలం పరిశ్రమలో నిలదొక్కుకోవాలనే భయం లేదా ఆందోళనతో కాకుండా, ఇప్పుడు తనకు మనస్ఫూర్తిగా నచ్చిన మంచి కథలను మాత్రమే ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛ లభించింది.
రాత్రికి రాత్రే పెరిగిన ఈ స్టార్‌డమ్‌ను తట్టుకోవడం ప్రారంభంలో కాస్త ఇబ్బందిగా, వింతగా అనిపించినప్పటికీ, కాలక్రమేణా అలవాటు పడ్డాను. అయితే, ఎలాంటి పరిస్థితుల్లోనూ తలబిరుసుతనం రాకుండా ఎప్పుడూ తన పనిపైనే 100% దృష్టి పెడతానని వ్యాఖ్యానించారు. చిత్ర పరిశ్రమ నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి రాకపోవడం ఎంతో మేలు చేసింది. ఎందుకంటే ఎల్లప్పుడూ వినయంగా, ఒదిగి ఉండేలా, భూమిపై కాలు మోపి నిలబడేలా చేస్తుందని అన్నారు.
Also read: నాకు కేవలం అదే ముఖ్యం... జయకృష్ణ వ్యాఖ్యలు వైరల్
ప్రీవియస్ మూవీ 'ఓ రోమియో' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి కమర్షియల్ విజయాన్ని సాధించలేకపోయింది. కానీ నా వ్యక్తిగత వైఫల్యంగా ఎప్పుడూ భావించను . ప్రతి నటుడూ లేదా నటి తమ క్యారక్టర్ కి 100 శాతం ప్రాణం పోసి, రక్తాన్ని ధారపోసి నటిస్తారు , . కానీ ప్రతిసారీ మనం అనుకున్నది అనుకున్నట్లు జరగకపోవచ్చు.సినిమా విడుదల సమయం, అంచనాలు లేదా ఇతర పరిస్థితుల వల్ల కొన్నిసార్లు ఫలితాలు తేడా కొడతాయని వివరించారు.
Triptii Dimri, Prabhas, Spirit






