Home

»

Latest News

ఓటిటిలో హిట్.. చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

Mar 23, 2026 12:21PM

 

 

-సినీ కలికాలం అంటే ఇదేనేమో 
-మోహన్ శ్రీవత్స' గుర్తున్నాడుగా 
-చెప్పుతో కొట్టుకున్నప్పుడు మీరేం చేసారు.

 

'మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు మల్లి జాజి అల్లుకున్న రోజు, ఏదో చెప్పాలని' అనే సాంగ్ ని ఇప్పుడు 'మోహన్ శ్రీవత్స'(MOhan Srivathsa)ఎంతో సంతోషంతో పాడుకుంటూ ఉంటాడు. బహుశా డాన్స్ చేస్తూ కూడా ఉండవచ్చు. అసలు శ్రీవాత్సవ ఎవరనే డౌట్ మీకు రావచ్చు. కానీ మీకు చిన్న క్లూ ఇచ్చాననుకోండి వామ్మో ఆయనెందుకు తెలియదని అంటారు. మరి ఆ క్లూ ఇచ్చేస్తున్నాను. 'త్రిబాణధారి బార్బరిక్'. ఇప్పుడు అర్థమైంది త్రిబాణధారి బార్బరిక్ మోహన్ శ్రీవత్స నే కదా. ఆయన్నెందుకు మర్చిపోతాం. సినిమా బాగున్నా జనం థియేటర్స్ రావడం లేదని చెప్పుతో కొట్టుకున్నాడు కదా అనుకుంటున్నారు కదు. ఇప్పుడు ఆ శ్రీ వాత్సనే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని పాడుకునే పరిస్థితి. మరి అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం.

  'త్రిబాణధారి బార్బరిక్'(Tribanadhari Barbarik)థియేటర్స్ లో ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. చాలా మందికి ఈ సినిమా విడుదలైందన్న విషయం కూడా తెలియదు. అలాంటిది శ్రీ వాత్సవ చెప్పుతో కొట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బార్బరిక్ పై ఒక లుక్ వేద్దామని అనుకున్నారు. కానీ అప్పటికే థియేటర్స్ లో లేదు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో హిట్ టాక్ తెచ్చుకుంది. ఓటీటీలో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుండటమే అందుకు నిదర్శనం. మరి ఈ లెక్కన మోహన్ శ్రీవత్స ఆవేదనకి  ఓటిటి ప్రేక్షకులు న్యాయం చేసారని చెప్పవచ్చు.

also read: Dhurandhar 2: పాకిస్థాన్ లో ఏడేళ్లు బిచ్చగాడిలా బతికిన అసలైన ధురంధర్ 

 కట్టప్ప సత్య రాజ్ ముఖ్యమైన క్యారక్టర్ పోషించగా సత్యం రాజేష్, ఉదయభానుతో పాటు మరికొంత మంది నటులు మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. పక్కా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com