Home

»

Latest News

Transfer trimurthulu: 100 కథల్ని విని ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులుతో వచ్చాడు.. మరి హిట్ కొట్టాడా!

Jun 22, 2026 4:52PM

 


ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు స్టార్ హీరో వడ్డే నవీన్(Vadde Naveen). ఈ నెల 19 న ట్రాన్స్ ఫర్  త్రిమూర్తులు(Transfer trimurthulu)తో థియేటర్స్ లో అడుగుపెట్టడంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అసలు మూవీ ప్రకటన వచ్చినప్పటి దగ్గర్నుంచే ఎప్పుడెప్పుడు నవీన్ సెల్యులాయిడ్ పై అడుగుపెడతాడా అని ఎదురుచూసిన అభిమానుల నెంబర్ కైతే లెక్కే  లేదు. పైగా 100 కథలని విన్న తర్వాత ఓకే చేసిన కథ అని నవీన్ చెప్పడంతో  తొలి రోజు భారీగానే థియేటర్స్ కి పోటెత్తారు.

ఇక అభిమానులు, ప్రేక్షకుల స్పందన చూసుకుంటే 'మూవీలో వడ్డే నవీన్ ఎప్పటి లాగానే తనదైన లుక్స్,డాన్స్, ఫైట్స్ తో మెస్మరైజ్ చేసాడు. కానీ కథ విషయంలోనే పొరపాటు జరిగింది. ఇలాంటి కథనంతో కూడిన కథలు గతంలో చాలానే వచ్చాయి కాబట్టి నేటి ట్రెండ్ కి తగ్గ కథతో రావాల్సింది. పోనీ మేకర్స్ అనుకున్న కథకే కొత్త రకం స్క్రీన్ ప్లే ని అప్లై చేయాల్సింది. నవీన్ తప్ప మిగతా నటీనటుల నటనలో కూడా మెరుపులు ఏం లేవు.  కాకపోతే కొంతలో కొంత ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కాపాడాయనే అభిప్రాయాన్ని వారంతా వ్యక్తం చేస్తున్నారు.

Also read: అగ్ర హీరో సోదరుడిపై గొడ్డలితో దాడి.. పరిస్థితి విషమం

రివ్యూస్ పరంగా చూసుకున్నా మెజారిటీ రివ్యూస్  మిక్స్డ్ టాక్ చెప్తున్నాయి. ఇక మూడు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే  తొలి రోజు 20 లక్షలుతో మూడు రోజులకి గాను టోటల్ గా ముప్పై లక్షల గ్రాస్ వసూలు చేసినట్టుగా ట్రేడ్ సర్కిల్స్ టాక్. వడ్డే నవీన్ స్వయంగా నిర్మించగా 7 కోట్ల బడ్జెట్ అనే టాక్ సినీ సర్కిల్స్ లో చాలా బలంగానే వినిపిస్తుంది


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com