Home

»

Latest News

Toxic: యష్ రిస్క్ చేస్తున్నాడా,బయటపడలేకపోతున్నాడా!

Aug 10, 2026 4:15PM

 

మొన్న యష్ వన్ మాన్ షో టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అలా రిలీజ్ అయ్యిందో లేదో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతూ ఉంది. స్టిల్ ఈ టైంకి ట్రైలర్ చూసే వాళ్ళ ఫిగర్ ని ఖచ్చితంగా చెప్పడం కష్టం. అంతలా తన యూనిక్ హీరోయిజంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్నాడు. 


యష్ కి అంతటి ఇమేజ్ ని సంపాదించిన చిత్రాలు 'కేజీఎఫ్: ఛాప్టర్ 1', ఛాప్టర్ 2' సినిమాలనే విషయాన్నీ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డులని తిరగరాశాయి. అయితే ఆ రెండు భారీ విజయాల తర్వాత యష్ తన తదుపరి అడుగు విషయంలో చాలా సమయం తీసుకున్నాడు. అయితే సినీ ప్రియులని , ట్రేడ్ విశ్లేషకులని ఆకట్టుకుంటున్న ప్రధాన అంశం ఏంటంటే టాక్సిక్ లో  యష్ 'రాయా' (Raya) అనే అత్యంత శక్తివంతమైన, గ్రే షేడ్స్ ఉన్న రోల్‌లో కనిపించబోతున్నాడు. గోవా డ్రగ్ అండ్ డాన్ బ్యాక్‌డ్రాప్‌లో, డార్క్ అండర్‌వరల్డ్ నేపథ్యంతో రూపొందుతుంది. ఇక మరొక వైపు, బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు నితేష్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం 'రామాయణ' (Ramayana) లో యష్ ది లంకేశ్వరుడైన 'రావణాసురుడి' రోల్. ఒకవైపు 'టాక్సిక్' లో డార్క్ అండర్‌వరల్డ్ కింగ్‌గా, ఇంకోవైపు 'రామాయణ' లో రావణుడిగా ఈ రెండు పాత్రల్లోనూ ప్రతి నాయక లక్షణాలు, తీవ్రమైన వైలెన్స్, నెగిటివ్ షేడ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

'కేజీఎఫ్' లో రాఖీ భాయ్ రోల్ గమనిస్తే,  కంప్లీట్ పాజిటివ్ హీరో కాదు. నేరాలు, ఘోరాలు చేసే గ్యాంగ్‌స్టర్ అయినప్పటికీ, ఆ క్యారెక్టర్‌కు ఉన్న ఎమోషన్, పవర్ఫుల్ మాస్ ఎలివేషన్స్ వల్ల ప్రేక్షకులు రాఖీ భాయ్‌ని ఒక ఐకానిక్ హీరోగా ఆరాధించారు. అయితే సాధారణంగా స్టార్ హీరోలు ఒక భారీ హిట్ తర్వాత సేఫ్ జోన్‌లోకి వెళ్లి సాఫ్ట్ లేదా రెగ్యులర్ కమర్షియల్ రోల్స్ ఎంచుకుంటారు. కానీ యష్ మాత్రం అందుకు భిన్నంగా పూర్తి నెగిటివ్ అండ్ డార్క్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ నే మళ్లీ ఎందుకు ఎంచుకున్నాడు అనే చర్చ సినీ వర్గాల్లోసాగుతోంది. ఇది యష్ కెరీర్‌లో ఒక విప్లవాత్మకమైన కొత్త ప్రయోగమా? లేక రాఖీ భాయ్ సృష్టించిన ఆ మాస్ ఇమేజ్, డార్క్ ఆరా నుంచి బయటపడలేకపోతున్నాడా? అనే ప్రశ్నలు అభిమానుల్లో రేకెత్తుతున్నాయి.

Also read: సంచలనం: మోహన్‌లాల్ కూతురు విస్మయ.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లు అంటే 

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇది యష్ తీసుకున్న ప్రమాదకరమైన రిస్క్ కాదు, తన బ్రాండ్ వాల్యూని మరియు గ్లోబల్ అప్పీల్‌ను అత్యంత తెలివిగా ఉపయోగించుకునే వ్యూహం. ప్రస్తుత పాన్-ఇండియా ట్రెండ్‌లో లార్జర్ ద్యాన్ లైఫ్, గ్రే అండ్ డార్క్ షేడ్స్ ఉన్న పాత్రలకే ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ దక్కుతోంది. సాదాసీదా సాఫ్ట్ క్యారెక్టర్స్ కంటే, డార్క్ షేడ్స్ ఉన్నరోల్స్ ల్లోనే నటుడిగా తనలోని విలక్షణమైన పవర్‌, నటనని  చూపించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.మరి రాబోయే 'టాక్సిక్'  'రామాయణ' చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సరికొత్త రికార్డులను సృష్టిస్తాయో, యష్ తన డార్క్ అవతారాలతో ప్రేక్షకులను ఎలా మెస్మరైజ్ చేస్తాడో వేచి చూడాలి!

Yash, Toxic, Geethu Mohandas, Ramayana

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com