
బళ్ళు ఓడలు అవడం, ఓడలు బళ్ళు అవ్వడం అనే సామెత సినీ రంగానికి కూడా వర్తిస్తుందని టాక్సిక్ మరోసారి చెప్పినట్లయింది. తొలి రోజుగా వరల్డ్ వైడ్ గా 140.75 కోట్ల గ్రాస్ వరకు రాబట్టిన టాక్సిక్ రెండో రోజు కేవలం 50 కోట్లు గ్రాస్ మాత్రమే రాబట్టింది.
దీంతో రెండు రోజులకి ప్రపంచవ్యాప్తంగా 190.75 కోట్ల గ్రాస్ మార్కు తాకింది. లాంగ్వేజెస్ వారీగా కలెక్షన్లని పరిశీలిస్తే, హిందీ బెల్ట్ మాత్రమే కాస్త ఊరటనిస్తోంది. తొలిరోజే హిందీలో 55 కోట్లు సాధించిన టాక్సిక్, రెండవ రోజు 23 కోట్ల వసూళ్లను రాబట్టింది. కన్నడ మాతృమాతృకలో తొలిరోజు . 23.30 కోట్లు రాగా, రెండో రోజు నాటికి రూ. 8.50 కోట్లకి పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు 16 కోట్ల నెట్ వసూలవ్వగా, రెండో రోజున కేవలం 3 కోట్లకి పరిమితమవడం కలవరపెట్టే అంశం. తమిళంలో 1.50 కోట్లు, మలయాళంలో 0.40 కోట్లు మాత్రమే వచ్చాయి. ముఖ్యంగా మాస్ ఏరియాల్లో 60 నుండి 80 శాతం వరకు థియేటర్ ఆక్యుపెన్సీ పడిపోవడం వ్యాపార వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
Also Read: ఓట్లు వెయ్యడానికి కూడా ఇలా వెళ్ళలేదు కదా..ఇరుముడి ప్రభంజనం
గతంలో ఆమిర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' ఎదుర్కొన్న తరహాలోనే టాక్సిక్ కూడా రెండో రోజే భారీ పతనాన్ని చూస్తోందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి లాంగ్ వీకెండ్, రక్షాబంధన్ సెలవుల దినాల్లో టాక్సిక్ ని ప్రేక్షకులు కాపాడతారో, లేదో చూడాలి.
Toxic, yash, Geethu Mohandas, TeluguCinema, TeluguCinema News, TeluguOneDotCom, Tollywood, Tollywood News






