
టాక్సిక్ పై ఫ్యాన్స్ , ప్రేక్షకుల్లో భారీ అంచనాలు
మార్చి 19 నుంచి జూన్ 4 కి వాయిదా
మళ్ళీ వాయిదా అంటు న్యూస్
షాక్ లో ఫ్యాన్స్
సౌత్ ఇండియాలో మీ ఇష్టమొచ్చిన సినీ ప్రేమికుడ్నికదిలించి కేజిఎఫ్ చాప్టర్ 1 ,చాప్టర్ 2 కి మధ్య రిలీజ్ గ్యాప్ ఎంతని అడగండి. టక్కున చెప్తారు. పైగా మనం అడగకుండానే ఆ సినిమాల స్థాయిలోనే నెక్స్ట్ చిత్రం కూడా ఉండాలని నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని 'టాక్సిక్'(Toxic)తో రాబోతున్నాడని చెప్తారు. అంతలా యష్ వాళ్లందరితో కనెక్ట్ అయి ఉన్నాడు.
టాక్సిక్ గత నెల మార్చి 19 న రిలీజ్ అవ్వాల్సింది. కానీ యుఎస్ తో పాటు గల్ఫ్ కంట్రిస్ లో కమ్ముకున్న యుద్ధ నేపథ్యంలో జూన్ 4 కి వాయిదా వేశారు. కానీ ఈ డేట్ నుంచి కూడా వెనక్కి వెళ్లనుందనే రూమర్స్ ఫ్యాన్స్ కి ఈ సమ్మర్ మరింత హీట్ గా ఉంది కదా అనేలా చేస్తుంది. ఆ న్యూస్ లో ఎలాంటి నిజం లేదని మేకర్స్ అధికారంగా వెల్లడి చేసారు. యధావిధిగా జూన్ 4 నే వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ కానుందని చెప్పారు.
also read: Ananya Nagalla: అలా అయితేనే ఒప్పుకుంటా.. అనన్య సీక్రెట్ బయటపడింది
రూమర్స్ గాళ్ళు మరింత కుళ్ళుకునే తాజా న్యూస్ ఏంటంటే ఓవర్ సీస్ లో యష్ ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కుతున్న అత్యధిక హై బడ్జెట్ మూవీగా కూడా ప్రాచుర్యం పొందిన టాక్సిక్ ఒక వినూత్నమైన కదాంశంతో తెరకెక్కింది. ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలైతే హాట్ టాపిక్ గా కూర్చొని ఉన్నాయి. యష్ డ్యూయల్ రోల్ లో చేస్తుండగా రుక్మిణి వసంత్,కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, తార సుతారియా ముఖ్యమైన క్యారెక్టర్స్. గీతు మోహన్ దాస్(Geethu Mohandas)దర్శకురాలు కాగా హిస్టారికల్ డ్రామాతో కూడిన గ్యాంగ్ స్టర్ ఫిలిం. జననాయగన్(Jananayagan)ప్రొడక్షన్ కంపెనీ కె వి ఎన్ ప్రొడక్షన్ నే నిర్మించింది.





.webp)
