
యష్ వన్ మాన్ షో ‘టాక్సిక్' ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా 322 కోట్ల క్లబ్ లో ఉంది. మరి ఈ లెక్కన పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే 322 కోట్ల నెంబర్ కాస్తా 622 కోట్ల నెంబర్ గా మారేదని ట్రేడ్ సర్కిల్స్ తో పాటు అభిమానుల అభిప్రాయం. అయితే టాక్సిక్ విడుదలైనప్పటి నుంచి సినీ ప్రియుల మధ్య ఒకటే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదేంటంటే, ఈ చిత్రాన్ని కన్నడతో పాటు ఇంగ్లీష్ భాషలో కూడా ఒకేసారి చిత్రీకరించారు. కానీ, ఇండియన్ థియేటర్లలో కేవలం ప్రాంతీయ భాషల్లో మాత్రమే రిలీజ్ చేయడంతో ఇంగ్లీష్ వెర్షన్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తూ వస్తున్నారు.
ఇప్పుడు ఆ అభిమానుల ఆ నిరీక్షణకి తెరదించుతూ ‘టాక్సిక్’ ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్ సెప్టెంబర్ 4న భారతీయ థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కొచ్చి, తిరువనంతపురం వంటి ప్రధాన నగరాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో ఈ ప్రత్యేక ప్రదర్శనలు ఉండబోతున్నాయి. అయితే ఈ ఇంగ్లీష్ వెర్షన్‌లో అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే దాని రన్‌టైమ్. భారతీయ భాషల్లో విడుదలైన ఒరిజినల్ వెర్షన్ రన్‌టైమ్ ఏకంగా 3 గంటల 14 నిమిషాలు (194 నిమిషాలు) ఉండగా, చాలామంది ప్రేక్షకులు సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
.webp)
Also Read: రష్మిక షాకింగ్ కామెంట్స్: మూడు నెలల పాటు విజయ్, రష్మిక దూరంగా ఉన్నారా!
ఇప్పుడు రాబోతున్న ఇంగ్లీష్ వెర్షన్ దాదాపు 17 నిమిషాల నిడివి తక్కువతో రాబోతుంది. కన్నడ మరియు ఇంగ్లీష్ వెర్షన్లు రెండూ సెన్సార్ బోర్డు నుంచి ‘A’ సర్టిఫికేట్ పొందినప్పటికీ, ఈ కొత్త వెర్షన్ వేగవంతమైన స్క్రీన్‌ప్లేతో మరింత ఆకట్టుకుంటుందని చిత్రబృందం భావిస్తోంది. సినిమాను ఒరిజినల్ మేకింగ్ టోన్, డెప్త్ మరియు ఎమోషన్స్‌తో ఇంగ్లీష్ భాషలోనే నేరుగా అనుభూతి చెందేందుకు ఇది మంచి అవకాశమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వెర్షన్ బుకింగ్స్ ఆన్‌లైన్ వేదికల్లో ప్రారంభమయ్యాయి. మరి ఇంగ్లీష్ వెర్షన్ విడుదల తర్వాత కలెక్షన్ల విషయంలో ఎలాంటి ఊపు అందుకుంటుందో చూడాలి.
[Toxic, yash, Kaira Adwani, Geethu Mohandas, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywoodnews]




.webp)
